కాకినాడ ( జనస్వరం ) : రాష్ట్ర భవిష్యత్తు దృష్ట్యా జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు పిలుపుమేరకు కాకినాడ రూరల్ ఇంచార్జ్ పంతం నానాజీ గారు ఆదేశానుసారం చంద్రబాబు నాయుడు గారి అక్రమ అరెస్టుకు నిరసనగా దీక్ష చేపట్టిన వారి సతీమణి నారా భువనేశ్వరి గారిని మర్యాదపూర్వకంగా కలిసి సంఘీభావం తెలియజేసిన జనసేన నాయకులు. రాష్ట్రంలో దుర్మార్గపు పాలన రాజ్యమేలుతుందని, సుదీర్ఘకాలం ముఖ్యమంత్రిగా రాష్ట్రానికి సేవలందించిన వ్యక్తిపై రాజకీయ కక్ష సాధింపు సరైన పద్ధతి కాదని,
చంద్రబాబు గారు త్వరగా ప్రజల మధ్యకు వస్తారని వారికి ధైర్యం చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర జనసేన పార్టీ సంయుక్త కార్యదర్శి భోగిరెడ్డి గంగాధర్, కాకినాడ రూరల్ సీనియర్ నాయకులు బిరుదా బాబు, కాకినాడ జిల్లా యువ నాయకులు నున్న గణేష్ నాయుడు, కరప మండల జనసేన పార్టీ కార్యదర్శి గోన ఆంజనేయులు పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com