వెల్దుర్తి, (జనస్వరం) : జనసేన పార్టీ నాయకులు సి జి రాజశేఖర్ మాట్లాడుతూ క్రిష్ణగిరి మండలం అలివేలి గ్రామానికి చెందిన బోయ సాలమ్మ భర్త బోయ మద్దిలేటి వీరికి గవర్నమెంట్ నుంచి YSRCP ఇంటి పట్టా housing sanction order list వచ్చింది. Layout ID.. benficere ID వచ్చినప్పటికి కానీ ఇప్పటి వరకు ఇంటి పట్టా ఇవ్వలేదు. ఇదే విషయాన్ని సాలమ్మ కుమారుడు పులి శేఖర్ V.R.O ని అడిగితే మీరు 2019 పంచాయతీ ఎన్నికల్లో జనసేన పార్టీ తరుపున సర్పంచు అభ్యర్థిగా పోటీ చేయడం వల్ల అందుకు మీ గ్రామం YSRCP నాయకులు, కార్యకర్తలు అందరూ బోయ సాలమ్మకు ఇంటి పట్టా ఇవ్వొద్దని. ఎవరికి చెప్పుకుంటవో చెప్పుకోపో అని అంటున్నారని ఈరోజు మా దృష్టికి తీసుకురావడం జరిగింది. ఈ విషయం మీద మండల MROని కలిసి బోయ సాలమ్మ కుమారుడు పులి శేఖర్ ఇంతక ముందు అనేకసార్లు మా ఇంటి పట్టా మాకు ఇవ్వండి అని అనేకసార్లు వినతిపత్రం ఇవ్వడం జరిగింది. అయినా ఎలాంటి ప్రయోజనం లేకపోవడం వల్ల మా దృష్టికి తీసుకు రావడం వల్ల ఎమ్మార్వోని కలిసి మాకు సోమవారం లోపల ఇంటి పట్టా ఇస్తే ఓకే లేదంటే జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఎమ్మార్వో ఆఫీస్ ముందర ధర్నా చేస్తామని తెలియజేయడం జరిగింది. కులం చూడం మతం చూడం పార్టీలు చూడం అన్న వైఎస్ఆర్సిపి పార్టీ నాయకులు ఒక సర్పంచ్ గా పోటీ చేసినందుకే ఇంతలా ఎందుకు భయపడుతున్నారో అర్థం అవుతుంది ఈ వైఎస్ఆర్సిపి తాటాకు చప్పళ్లకు ఇక్కడ ఎవరు భయపడరాన్ని విషయం గ్రహించాలి. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు, సీజీ రాజశేఖర్, బోయ గోవిందు, టీ పులి శేఖర్, ఈ చిరంజీవి గౌడు, బి తిరుపాల్, సి నాగేశ్వరరావు, ఎన్ బాబ్జి, రాకేష్, సౌఖత్, నరసింహుడు తదితరులు పాల్గొన్నారు.