Logo
Date of Publish : 08 October 2022, 3:28 am
Editor : Sake Naresh

ముంపునకు గురైన ప్రాంతాల్లో పర్యటించిన ఇచ్ఛాపురం జనసేన నాయకులు

      ఇచ్ఛాపురం, (జనస్వరం) : శ్రీకాకుళం జిల్లా, ఇచ్ఛాపురం మండలంలో భారీ వర్షాలు వల్ల ముంపునకు గురైన  ప్రాంతాలను ఇచ్ఛాపురం జనసేనపార్టీ దాసరి రాజు, జనసేన నాయకులు కలసి పర్యటించారు. ఈ సందర్భంగా దాసరి రాజు పలు గ్రామాల్ని సందర్శించి, అక్కడి పరిస్థితులను గ్రామస్తులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తులసిగాం పంచాయితీలో బలరాంపురం, లండపుట్టుగ, ఇన్నేసుపేట, తులసిగాం గ్రామాల్లో సుమారు 72 ఇల్లు స్థలాలు జగనన్న కాలనీ కింద ఇక్కడ ఇవ్వడం జరిగింది. పద్మాపురం గడ్డ (దొండిగడ్డ) నుండి వచ్చే నీరు వర్షాలకు నిత్యం ఈ కాలనీలోకి వస్తుందని తెలిపారు. ఇక్కడ నిరుపేద కుటుంబాలకు ఇల్లు స్థలాలు ఇచ్చారు. ఇక్కడ ఎలా ఇల్లు కట్టుకుంటారు, ఎలా నివసిస్తారు అని దాసరి రాజు ప్రశ్నించారు. ఈ ప్రాంతానికి అనుకోని వందల ఎకరాలు పంట పొలాలు ఉన్నాయని, వరదలకు పంటలు మునిగి రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని వాపోయారు. దీనిపైన తక్షణమే ప్రభుత్వ అధికారులు స్పందించి దీని చుట్టూ వాలును (రక్షణ గోడ) నియమించాలి. అలాగే ఈ స్థలంపైన మట్టి కూడ వేసి ఎత్తు చేసి ఈ సమస్యకు శాశ్విత పరిష్కారం చూపాలని జనసేనపార్టీ తరుపున కోరుతున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఇన్నేసుపేట జనసేన యూత్ లీడర్ దుంగు భాస్కర్ రెడ్డి, నగేష్, దుంగు కుమార్, ఇసురు వెంకటేష్, దుంగు ఢిల్లీ, ఇసురు ప్రసాద్, దుంగు రమేష్, ఇసురు రాజు, దుంగు తారకేష్ తదితరులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com