ఇచ్ఛాపురం, (జనస్వరం) : శ్రీకాకుళం జిల్లా, ఇచ్ఛాపురం మండలంలో భారీ వర్షాలు వల్ల ముంపునకు గురైన ప్రాంతాలను ఇచ్ఛాపురం జనసేనపార్టీ దాసరి రాజు, జనసేన నాయకులు కలసి పర్యటించారు. ఈ సందర్భంగా దాసరి రాజు పలు గ్రామాల్ని సందర్శించి, అక్కడి పరిస్థితులను గ్రామస్తులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తులసిగాం పంచాయితీలో బలరాంపురం, లండపుట్టుగ, ఇన్నేసుపేట, తులసిగాం గ్రామాల్లో సుమారు 72 ఇల్లు స్థలాలు జగనన్న కాలనీ కింద ఇక్కడ ఇవ్వడం జరిగింది. పద్మాపురం గడ్డ (దొండిగడ్డ) నుండి వచ్చే నీరు వర్షాలకు నిత్యం ఈ కాలనీలోకి వస్తుందని తెలిపారు. ఇక్కడ నిరుపేద కుటుంబాలకు ఇల్లు స్థలాలు ఇచ్చారు. ఇక్కడ ఎలా ఇల్లు కట్టుకుంటారు, ఎలా నివసిస్తారు అని దాసరి రాజు ప్రశ్నించారు. ఈ ప్రాంతానికి అనుకోని వందల ఎకరాలు పంట పొలాలు ఉన్నాయని, వరదలకు పంటలు మునిగి రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని వాపోయారు. దీనిపైన తక్షణమే ప్రభుత్వ అధికారులు స్పందించి దీని చుట్టూ వాలును (రక్షణ గోడ) నియమించాలి. అలాగే ఈ స్థలంపైన మట్టి కూడ వేసి ఎత్తు చేసి ఈ సమస్యకు శాశ్విత పరిష్కారం చూపాలని జనసేనపార్టీ తరుపున కోరుతున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఇన్నేసుపేట జనసేన యూత్ లీడర్ దుంగు భాస్కర్ రెడ్డి, నగేష్, దుంగు కుమార్, ఇసురు వెంకటేష్, దుంగు ఢిల్లీ, ఇసురు ప్రసాద్, దుంగు రమేష్, ఇసురు రాజు, దుంగు తారకేష్ తదితరులు పాల్గొన్నారు.