చంద్రగిరి ( జనస్వరం ) : అన్నం పండించే రైతు, అన్నం పెట్టే రైతన్న ఈరోజు కన్నీరు పెడుతూవుంటే ఈ రాష్ట్రంలో నాయకులు నిద్ర నటిస్తున్నారు, వారికి మెలకువ వచ్చినప్పుడల్లా రైతుల పొలాలు, ఆస్తులను దోచుకుంటూ కాలం గడుపుతున్నారని జనసేన నాయకులు అన్నారు. స్థానిక చంద్రగిరి మండలం, పణపాకం భూ నిర్వాసితుల స్థలాలను లాక్కోవడం, వారికి నామమాత్రంగా నష్టపరిహారం కల్పించే, దానిని అడ్డుకున్న వారిపై పోలీసు యంత్రాంగం సహాయంతో నడిరోడ్డున పడేస్తున్నారన్నారు. వీటిని అడ్డుకునే క్రమంలో రైతులకు అండగా చంద్రగిరి నాయకులు దేవర మనోహర మరియు రాష్ట్ర కార్యదర్శి ఆకేపాటి సుభాషిణి వారికి అండగా నిలబడి ప్రభుత్వ యంత్రాంగ వైఖరిపై నిరసన తెలియచేసి రైతులకు వెంటనే న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ మహిళా నాయకురాలు ఆశా, నాయకులు సాయి, మురళి తదితరాలు పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com