అమలాపురం ( జనస్వరం ) : పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా అమలాపురం జనసేన పార్లమెంట్ ఇంచార్జ్ డి.యం.ఆర్.శేఖర్ గారి అధ్వర్యంలో 7 రోజుల సేవా వారోత్సవాలలో భాగంగా ఆఖరి రోజు కోనసీమ వ్యాప్తంగా ప్రజలు దయనందన జీవితంలో వారు ఎదుర్కుంటున్న అనేక సమస్యల పట్ల స్పందించి సమస్యల పరిష్కారం కోసం ఉచితంగా నిరంతరాయంగా సేవలను అందిస్తున్న ఎందరో సేవా ముర్తులను గుర్తించి వారిని తగురీతిలో స్థానిక పార్టీ కార్యాలయంలో సన్మానించడం జరిగినది. ఈ సందర్భంగా డి.యం.ఆర్ శేఖర్ గారు మాట్లాడుతూ జనసేన పార్టీ ప్రధాన లక్ష్యం ప్రజలకు సేవ చేయడమనీ అలా ప్రజల కొరకు సేవ చేస్తున్న సేవా మూర్తులకు జనసేన పార్టీ ఎప్పుడూ గుర్తించి తగిన రీతిలో గౌరవిస్తుందని తెలిపారు. ఈ సందర్భంగా సన్మాన గ్రహీతలు. డాక్టర్ శ్రీమన్నారాయణ, విలాస మీరా సాహెబ్, ఇమ్మడివారి పాడు షలోమి, షేక్ జానీ, ఆకొండి పవన్, ఐ & బ్లడ్ బ్యాంక్ యీండురి రాఘవ నాగేశ్వర రావు, సలాది గోపాల కృష్ణ నాయుడు, డాక్టర్ మెట్ల సూర్యనారాయణ, దేవరపల్లి శాంత కుమార్, చిక్కం సత్యప్రసాద్, డిగ్రీ కాలేజ్ కిరణ్ కుమార్ లను సన్మానించారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ జిల్లా నాయకులు, మండల నాయకులు, సర్పంచులు, ఎంపీటీసీలు, కౌన్సిలర్స్, జనసైనికులు, వీర మహిళలు, తదితరులు పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com