చిత్తూరు ( జనస్వరం ) : సమైక్యాంధ్ర మొదలుకొని నేటివరకు రాష్ట్రాన్ని రాయలసీమకు చెందిన నాయకులే ఎక్కువ శాతం పైగా పాలించారుఅయినప్పటికీ రాయలసీమ మాత్రం వెనుకబాటుతనానికి గురైందని జనసేన పార్టీ చిత్తూరు జిల్లా కార్యదర్శి ఏపీ శివయ్య అన్నారు. ఆయన మాట్లాడుతూ రాయలసీమలో కరువు కాటకాలు ఉన్నందున ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలంటే ఇక్కడ నేతలను సీఎం చేస్తే ఈ ప్రాంతం అభివృద్ధి అవుతుందని భావించారు. అనేకసార్లు రాయలసీమకు చెందిన వ్యక్తులను ముఖ్యమంత్రిగా చేశారు. అయితే వీరు తమ వ్యక్తిగత స్వలాభం చూసుకున్నారు తప్ప, రాయలసీమ అభివృద్ధి కోసం పాటుపడింది లేదు. ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం అధికార పార్టీ నేతలు మూడు రాజధానులు అని పేర్కొంటూ అభివృద్ధి మంత్రం జపిస్తున్నారు. ఒక ప్రాంతంలో రాజధాని ఏర్పాటు చేసి రాష్ట్రం మొత్తాన్ని అభివృద్ధి చేయకుండా మూడు చోట్ల రాజధానులు అంటూ రాష్ట్ర అభివృద్ధిని విస్మరిస్తున్నారు. వైసీపీ నాయకులకు రాయలసీమ మీద నిజంగా అభిమానం, ప్రేమ ఉంటే కొత్త ఇండస్ట్రీయల్ హబ్ లను, కంపెనీలను తీసుకొచ్చి యువతకు ఉపాధి కల్పించండి. పక్క రాష్ట్రాలకు వలసలు వెళ్తున్న రైతన్నలను ఆపి, వారికి సరైన ప్రోత్సాహాకాలు అందించండి. కేవలం న్యాయ రాజధాని అని చెప్పి రాయలసీమని మీ స్వలాభం కోసం వాడుకుంటే సహించేది లేదన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com