Logo
Date of Publish : 16 November 2022, 3:14 pm
Editor : Sake Naresh

అవినీతి నాయకులకు లీడర్ జగన్ మోహన్ రెడ్డి : రైల్వే కోడూరు జనసేన నాయకులు

      రైల్వే కోడూరు, (జనస్వరం) : రైల్వే కోడూరు నియోజకవర్గం వైసిపి ఎమ్మెల్యే కోరమట్ల శ్రీనివాసులు చేసిన వ్యాఖ్యలను రైల్వేకోడూరు జనసేన వేదికగా ఖండిస్తున్నాము. కొరముట్ల కోడూరులో నిర్వహిస్తున్న గడపగడప కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ ని విమర్శించడం జరిగింది. రైల్వేకోడూరు జనసేన వేదికగా కొరముట్లని రెండు విషయాలు అడగాలని కొరుకుంటున్నామని తెలిపారు. మొదటగా మీ గ్రామం బ్రిడ్జి పూర్తి చేసి మాట్లాడితే బాగుంటుందని ఎమ్మెల్యేకి సలహా ఇస్తున్నాం. రాష్ట్రంలో జగన్ రెడ్డి అధికారంలో వచ్చాక పావలా వంతు కూడా అభివృద్ధి చేయకుండా మెహర్బానీ మాటలు మాట్లాడుతున్న నాయకుడు మీ జగన్ రెడ్డి  అని గుర్తు చేస్తున్నాం.అం దుకే జనసేన తరఫున పావలా జగన్ మోహన్ రెడ్డి అని నామకరణం చేస్తున్నామని తెలిపారు. మీ నాయకుడి బిరుదుని ఎదుటివారికి ఆపదించి మాట్లాడటం మీ మూర్ఖత్వమే అని తెలియజేస్తున్నాం. మీరు ప్రతిపక్షంలో ఉన్నపుడు చంద్రబాబు మీద అవినీతి చక్రవర్తి అని బుక్కు ప్రింట్ చేసి ఒక్క రూపాయి కూడా అవినీతిని నిరూపించలేక జగన్ రెడ్డి చంద్రబాబుతో తమ దొంగ చాటు స్నేహాన్ని జనసేన తరపున గుర్తు చేస్తున్నాం. రాబోయే ఎన్నికల్లో కోడూరులో ఎగిరేది జనసేనపార్టీ ఎమ్మెల్యే జెండా అని ఘంటా పదంగా చెప్తున్నాం. నాలుగు సార్లు కోడూరు ఎమ్మెల్యేగా గెలిచిన కోరమట్ల శ్రీనివాసులు కోడూరు అభివృద్ధికి చేసిన ప్రయత్నం శూన్యం అని ఈ సమావేశం సందర్భంగా ప్రజలందరికీ తెలియజేస్తున్నామని తెలిపారు. రాజంపేటను జిల్లా హెడ్ కోటర్ గా చేసుకొనే పోరాటంలో కొరముట్ల శ్రీనివాసులు నిర్వీర్యం చేసిన ఘనత దక్కించుకున్నారని ఈ సమావేశం సందర్భంగా ప్రజలందరికీ తెలియజేస్తున్నాం. ఇప్పటికైనా ఎమ్మెల్యే వాస్తవాలను గుర్తించి పవన్ కళ్యాణ్ మీద అకారణంగా నిందలు వేసే కార్యక్రమానికి స్వస్తి పలకాలని డిమాండ్ చేస్తున్నాం. ఈ కార్యక్రమంలో జనసేన సీనియర్ నాయకులు ముత్యాల కిషోర్, మర్రి రెడ్డి ప్రసాద్, ఉత్తరాది శివకుమార్, యద్దల అనంతరాయులు, లింగాల హరి, జనసేన నాయకులు నగిరిపాటి మహేష్, సిరియాల శివకుమార్ పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com