Logo
Date of Publish : 09 December 2025, 8:21 pm
Editor : Sake Naresh

న్యాయవాదులు,పోలీసులతో న్యాయాధికారుల సమీక్ష

న్యాయవాదులు పోలీసులతో న్యాయాధికారుల సమీక్ష.

సత్తెనపల్లి,డిసెంబర్09.(జనస్వరం)

జాతీయ,రాష్ట్ర, జిల్లా న్యాయ సేవాధికార సంస్థల ఆదేశాల మేరకు ఈనెల 13 వ తేదీన స్థానిక కోర్టు ఆవరణలో నిర్వహించనున్న జాతీయ లోక్ అదాలత్ సంబంధించి మంగళవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. న్యాయాధికారులు న్యాయవాదులు, పోలీసులతో ఈ సమీక్ష నిర్వహించారు. సమీక్షకు అధ్యక్షత వహించిన గుంటూరు జిల్లా రెండవ అదనపు జిల్లా న్యాయ అధికారి వై నాగరాజా మాట్లాడుతూ సత్తెనపల్లిలో సివిల్ కేసులు సుమారు 200 రాజీమార్గం ద్వారా పరిష్కరించడానికి న్యాయవాదులు సహకరించాలన్నారు. ఈ మేరకు ఏమైనా సమస్య ఉన్నట్లయితే న్యాయాధికారులు సహకరిస్తారన్నారు. నగదుకు సంబంధించిన ఈపీలు పెద్ద సంఖ్యలో పరిష్కారానికి సహకరించవలసిందిగా కోరారు.నగదు ఈపీలు పరిష్కారంలో ఏమైనా సమస్యలు ఉన్నట్లయితే తమ దృష్టికి తెస్తే వెంటనే పరిష్కరిస్తామన్నారు. క్రిమినల్ కేసులు కూడా పెద్ద సంఖ్యలో రాజీమార్గం ద్వారా పరిష్కరించడానికి ఫిర్యాదు దారులకు నిందితులకు తమ సూచనలు ఇచ్చి కౌన్సిలింగ్ నిర్వహించి సహకరించవలసిందిగా పోలీసు అధికారులను కోరారు.

సమావేశంలో మూడవ అదనపు జిల్లా న్యాయ అధికారి సిహెచ్ వి ఎన్ శ్రీనివాసరావు, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి జియావుద్దీన్, స్థానిక న్యాయాధికారులు వి.విజయ్ కుమార్ రెడ్డి,తౌషీద్ హుస్సేన్, పి.ప్రియదర్శిని, జె.సృజన్ కుమార్ న్యాయవాద సంఘ అధ్యక్షులు గంగూరి అజయ్ కుమార్, సబ్ డివిజన్ లోని సర్కిల్ ఇన్స్పెక్టర్ లు,ఎస్సైలు, పోలీస్ సిబ్బంది పలువురు సీనియర్ జూనియర్ న్యాయవాదులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com