Logo
Date of Publish : 22 November 2022, 3:06 pm
Editor : Sake Naresh

“రౌడీ సేన” అనడం చాలా నీచమైన హేయమైన చర్యగా ఖండించిన లాయర్ జయరాం రెడ్డి

    అనంతపురం, (జనస్వరం) : జగన్మోహన్ రెడ్డి నరసాపురం సభలో జనసేన పార్టీని, జనసేన పార్టీ శ్రేణులను ఉద్దేశించి... "రౌడీ సేన" అనడం చాలా నీచమైన హేయమైన చర్య తీవ్రంగా ఖండిస్తున్నామని అనంతపురం జిల్లా జనసేనపార్టీ ఉపాధ్యక్షులు లాయర్ కుంటి మద్ది జయరాం రెడ్డి అన్నారు. సైకోలకు, గూండాలకు, రౌడీలకు జనసేన పార్టీ "రౌడీ సేన" లాగా కనిపిస్తుంది.భారతదేశ చరిత్రలోనే నీతి నిజాయితీతో బాధ్యతాయుతంగా విలువలతో... రాజకీయం చేస్తున్న ఏకైక పార్టీ జనసేన పార్టీ మాత్రమే గుర్తించుకోండి. కౌలు రైతులు నిస్సహాయ స్థితిలో ఆత్మహత్యలు చేసుకుని చనిపోతే జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ కష్టపడి సంపాదించిన సొంత నిధులు వెచ్చించి ప్రతి కౌలు రైతు కుటుంబానికి లక్ష రూపాయలు ఇచ్చి జనసేన పార్టీ ఆదుకున్నందుకు? రౌడీ సేన అందామా? 30 లక్షల గృహాలు పేద ప్రజలకు నిర్మించి ఇస్తాము అని గొప్పలు చెప్పుకొని, ఘనమైన పబ్లిసిటీ చేసుకొని కనీసం నేటి వరకు లక్ష గృహాలు కూడా లబ్ధిదారులకు ఇవ్వలేదు. ఈ వాస్తవాలు ప్రజలకు తెలియజేసినందుకు రౌడీ సేన అందామా? ప్రభుత్వ అధికారంలోకి వచ్చి నాటి నుంచి నేటి వరకు రాష్ట్రవ్యాప్తంగా రోడ్లన్నీ గుంతల మయం అయిపోయినాయి. గుంతలు పడిన రోడ్లకు మరమ్మత్తులు చేయకుండా కనీసం పిటికడు మట్టి కూడా రోడ్లోకి వేయకుండా ప్రజలు ఇబ్బందులు పడుతుంటే ఆ వాస్తవాలు ప్రపంచానికి రాష్ట్ర ప్రజలకు తెలియజేసినందుకు రౌడీ సేన అందామా? రాష్ట్ర ప్రజలకు తమ సమస్యలు ఎవరికి చెప్పుకోవాలో తెలియక అయోమయ, దీన, హీన పరిస్థితిలో ఉంటే... వినడానికి నీకు తీరిక లేకుండా ఉన్నావు. ప్రజావాణి కార్యక్రమం ద్వారా జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ప్రజల సమస్యలు తెలుసుకొని ప్రభుత్వ దృష్టికి తెలియజేస్తుంటే అందుకు... రౌడీ సేన అందామా? రాష్ట్ర ప్రభుత్వం ప్రజల బాగోగులు వినకుండా వారి సమస్యలు తీర్చకుండా... ప్రజలు నిత్సాహాయిస్థితిలో విధి లేక జనసేన పార్టీ వైపు ఆకర్షితులు అవుతున్నందుకు... రౌడీ సేన అందామా? మీ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు నుంచి రాష్ట్ర ప్రజల సంపదను వనరులు మీరు మీ నాయకులు అడ్డుగోలుగా దోచుకుంటున్నారు. అందుకు జనసేన పార్టీని రౌడీ సేన అందామా? మీ సొంత జిల్లాలో మీ వ్యక్తిగత స్వార్థ లాభ ప్రయోజనాల కోసం అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకుపోయి సంవత్సర కాలం గడుస్తుంది నిర్వాసితులకు ఇంతవరకు మీరు సరైన వసతులు కల్పించలేదు. మీ సొంత నియోజకవర్గం పులివెందులలో నిస్సహాయ స్థితిలో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ చనిపోయిన ప్రతి కౌలు రైతు కుటుంబానికి లక్ష రూపాయలు ఇచ్చారు. అందుకు రౌడీ సేన అందామా? జగన్మోహన్ రెడ్డి మీరు కనీసం మీ సొంత జిల్లాకు న్యాయం చేయలేని నిస్సహాయ స్థితిలో మీరు ఉన్నందుకు... జనసేన పార్టీ రౌడీ సేన అందామా? వైసిపి గుండాల ఆగడాలు భరించలేక రాష్ట్ర ప్రజలు బై ...బై.... బాబాయ్ (వివేక) జగన్ బాబు అంటున్నారు. జగన్మోహన్ రెడ్డి మీరు గాని... మీ YCP నాయకులు గానీ జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గురించి గానీ... జనసేన పార్టీ శ్రేణులు గురించి గానీ తప్పుడు మాటలు మాట్లాడితే చూస్తూ ఊరుకోమని హెచ్చరిస్తున్నాం.. ఖబర్దార్ అంటూ తెలిపారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com