Logo
Date of Publish : 18 August 2021, 7:29 am
Editor : Sake Naresh

దిక్కు దిశ లేని చట్టాలు కాదు.. బలమైన న్యాయవ్యవస్థ రూపకల్పన జరగాలి : ఈమని కిషోర్

                     కృష్ణా ( జనస్వరం ) : ఆడబిడ్డ నడిరోడ్డుపై అర్దరాత్రి కూడా స్వేచ్ఛ గా తిరగాలి అని ఎంతో మంది మహానుభావులు ప్రాణత్యాగలు చేసి మనకి స్వేచ్ఛ స్వాంతత్ర్యాన్ని ఇచ్చారు. మరి ఆ స్వాతంత్ర దినోత్సవం రోజునే గుంటూరు లో రమ్య అనే ఆడబిడ్డపై ఒక ఆగంతకుడు అతి దారుణంగా దాడి చేసి హతమార్చటం అతి బాధాకరం. ఆ యువతి కుటుంబానికి జనసేన పార్టీ తరుపున మా ప్రగాఢ సానుభూతిని తెలియచేస్తున్నాము అని జనసేన పార్టీ కృష్ణా జిల్లా సంయుక్త కార్యదర్శి ఈమని కిషోర్ కుమార్ పత్రిక ముఖంగా తెలియచేసారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో తరుచూ విద్యార్థినిలు, యువతులపైన దాడులు హత్యలు చోటుచేసుకుంటున్నాయి. మరి ఇలాంటి ఘటనలకు పాలుపడుతున్న వారిని కట్టడి చేసే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం స్పష్టంగా కనిపిస్తుంది అని ఆయన తెలిపారు. దిశ చట్టం, దిశ ఆప్ అని ప్రచారం చేసుకుంటున్నారు తప్ప ఆడబిడ్డలకు రక్షణ ఇవ్వలేకపోతున్నారని, ఇలాంటి ఘటనలు జరిగిన ప్రతిసారి బాధిత కుటుంబాలకు నష్ట పరిహారం ఇచ్చి, అమలులేని దిశ చట్టాల గురించి చెప్పి ఇన్ని రోజుల్లో శిక్ష పడుతుందని చెప్పి కుటుంబాలను మోసం చేసి, ఈ ప్రభుత్వం చేతులు దులుకుంటుందని ఆయన తెలిపారు. మరి ఈ ఘటనను అవకాశంగా తీసుకుని ప్రతిపక్ష తెలుగుదేశం శవ రాజకీయం చేస్తుందని, నెన్న గుంటూరు లో నారా లోకేష్ గారు ఆడబిడ్డకి కష్టం వస్తే తగ్గేదే లేదు అని ప్రచారాలు చేస్తున్నారని, మీ ప్రభుత్వ హయాంలో మీ నాన్న గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కర్నూల్ లో సుగాలి ప్రీతి అనే ఆడబిడ్డ ఉరేసుకుని చనిపోతే అప్పుడు, ఇప్పటికి మీరు అందుకు మాట్లాడలేదని ఆ బిడ్డ తరుపున మీరు ఎందుకు పోరాటం చేయటం లేదు అని, ఆ బిడ్డ కి ఒక న్యాయం, ఈ ఆడబిడ్డ కి ఒక న్యాయమా అని జనసేన పార్టీ తరుపున నారా లోకేష్ గారిని ప్రసిస్తున్నాం అని ఆయన తెలిపారు. రాష్ట్రంలో ఆడబిడ్డలకు న్యాయం జరిగేది ఒక్క జనసేన పార్టీ వలనే అని, రమ్య హత్య కేసులో అరెస్ట్ చేసిన నిందితుడిని కఠినంగా శిక్షించాలని, మరొక్క మారు రాష్ట్రంలో ఇలాంటి ఘటనలు జరగకుండా చేయాలన్న కూడా భయపడే విధంగా ఆ నిందితుడిని శిక్షించాలని జనసేన పార్టీ తరుపున ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నామని ఆయన తెలిపారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com