చిత్తూరు, (జనస్వరం) : జనసేన పార్టీ నాయకులు యుగంధర్ పొన్నాల గారు వెదురు కుప్పం మండలం తహసీల్దార్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ పచ్చికాపల్లం పంచాయతీ, పచ్చికాపల్లం డంపింగ్ యార్డు ప్రక్కన ఎర్ర బంగారాన్ని రెండు జెసిబిలు, కొన్ని టిప్పర్ లలో సరఫరా చేసి, గతవారంలో ఒక కోటి రూపాయలు ఆదాయం పొందిన వారు, ఎంతటి వారైనా, ఏ అధికారి అయినా వారి మీద చట్ట పరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఎవరికైనా మట్టి అవసరమైన, మరి ఇంకేదీ ఆవశ్యకత అయినా సచివాలయం గాని లేదా మండల తహసీల్దార్ ద్వారా అనుమతి తీసుకొని లాయల్ గా, లీగల్గా పంచాయతీకి ఆదాయం చేకూరే విధంగా చేయాలనీ డిమాండ్ చేశారు. ప్రకృతి సంపదను దోచుకునేవారు దేశద్రోహులుగా మిగిలి పోతారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రకృతి సంపద, ప్రజాధనం దుర్వినియోగం అవ్వకూడదని తెలిపారు. అక్రమార్కులను విజ్రామార్కులుగా చేయకండని తెలియజేసారు. ప్రభుత్వ ఆస్తులంటే భయపడే చట్టం రావాలని తెలియజేశారు. జేసీబీలు, టిప్పర్ల మీద కేసులు పెట్టాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ ఆస్తులకు సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలనీ తెలిపారు. నేటి రాజకీయ వ్యవస్థలో సామాజిక రాజకీయ వ్యవస్థను అవలంబించాలని కోరారు. జనసేన పార్టీ ఉన్నది సేవకే గాని సంపాదనకు కాదని తెలిపారు. ఈ కార్య క్రమంలో జిల్లా సంయుక్త కార్యదర్శి కోలారు వెంకటేష్, మండల ఉపాధ్యక్షులు కిషోర్ రెడ్డి, మధు, ప్రధాన కార్యదర్శి సతీష్, నియోజకవర్గం సమన్వయ కర్త రాఘవ, జనసైనికులు తదితురులు పాల్గొన్నారు.