
చిట్వేలు ( జనస్వరం ) : అనంతపురంలోని SSBN ఎయిడెడ్ కళాశాలలు, పాఠశాలల విలీనాన్ని వ్యతిరేకిస్తూ శాంతియుత నిరసన చేపట్టిన విద్యార్థులపై పోలీసులు లాఠీచార్జీ అమానుషమని మాదాసు నరసింహ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అనంతపురంలో శతాబ్దాల చరిత్ర ఉన్న ఎస్ఎస్ఎఎన్ కళాశాలను ఎయిడెడ్ గానే కొనసాగించాలని విద్యార్థులు చేస్తున్న ఆందోళనను పోలీసుల ద్వారా ఆపాలని చూడడం అప్రజాస్వామికమని, ఆందోళన చేస్తున్న విద్యార్థులపై లాఠీలు కురిపించి భయభ్రాంతులకు గురి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఒక విద్యార్థి జయలక్ష్మి తలకు బలమైన గాయం అయింది అంటే ఆ కళాశాల ప్రాంగణంలో ఎలాంటి పరిస్థితులు ఏర్పడ్డాయి అర్ధం అవుతుందన్నారు. విద్యార్థులు వారి తల్లిదండ్రులు పడుతున్న ఆవేదనను పరిగణనలోకి తీసుకోకుండా ఈ అంశాన్ని ఒక శాంతిభద్రతల సమస్యగా మార్చాలి. ఎందరో దాతలు విద్య అభివృద్ధి కోసం ఆస్తులు దానం చేసి పేదలకు విద్యను చేరువ చేశారని మా దాస్ నరసింహ పేర్కొన్నారు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు అనాలోచిత చర్యల వల్ల ఎంతో చరిత్ర ఉన్న పాఠశాలలు, కాలేజీలు విద్యార్థులకు దూరమయ్యే పరిస్థితులు నెలకొన్నాయని మాదాసు నరసింహ పేర్కొన్నారు.