ఆళ్ళగడ్డ ( జనస్వరం ) : జనసేన నాయకులు మైలేరి మల్లయ్య చింతకుంట రోడ్ లో ఉన్నటువంటి జగనన్న టిడ్కో ఇళ్లు నిర్మాణాన్ని సందర్శించారు. అనంతరం ఆయన మీడియాతో ఈ నెల 12, 13, 14 తేదీల్లో శ్రీ పవన్ కళ్యాణ్ గారి పిలుపుమేరకు 'జగనన్న ఇళ్లు - పేదలందరికీ కన్నీళ్లు' జనసేన సామాజిక పరిశీలన కార్యక్రమం చేపట్టామని తెలియజేశారు. పేదవాళ్ల సొంతింటి కలను
జగనన్న కాలనీల పేరిట పేదవాడికి జరిగిన అన్యాయాన్ని #JaganannaMosam హ్యాష్ ట్యాగ్ తో ఫోటోలు, వీడియోలు అప్ లోడ్ చేసే కార్యక్రమం ద్వారా వైఎస్ఆర్సిపి అవినీతిని, అలసత్వాన్ని ప్రజలకు తెలియజేస్తామన్నారు. పేదలందరి ఇళ్ల పథకం కింద రాష్ట్రవ్యాప్తంగా 28 లక్షల 30 వేల మందికి ఇళ్లు నిర్మించి ఇస్తామని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి హామీ ఇచ్చారు. అందులో భాగంగా తొలి విడతలో 18,63,552 గృహాలు 2022 జూన్ నాటికి నిర్మించి పేదలకు అందిస్తామని చెప్పారు. ఆయన చెప్పిన గడువు ముగిసి 5 నెలలు కావస్తుంది రాష్ట్రంలో ఎక్కడా కూడా ఒక ఇల్లు కూడా పేదలకు ఇచ్చిన దాఖలాలు లేవు.
జగనన్న కాలనీలో భూసేకరణ పేరుతో దోపిడీ రాష్ట్రవ్యాప్తంగా 68,677 ఎకరాలను ప్రభుత్వం కొనుగోలు చేసింది. రూ 10 నుంచి రూ 20 లక్షలు విలువ చేసే ఎకరా భూమిని 70 లక్షల నుంచి కోటి రూపాయలు పెట్టి కొనుగోలు చేశారు. సుమారు రూపాయలు 23,500 వందల కోట్లు వెచ్చించి ఈ భూములు కొన్నారు. ఇందులో వందల కోట్లు చేతులు మారాయి. అలాగే మౌలిక సదుపాయాల కోసం మరో 34 వేల కోట్లు ప్రభుత్వం కేటాయించింది. ఇంత పెద్ద మొత్తంలో ఖర్చు చేసిన జగనన్న కాలనీలో తాగునీరు, రోడ్లు వంటి కనీసం మౌలిక సదుపాయాలు లేవు గృహ నిర్మాణ పథకానికి నిధులన్నీ కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తున్నవే. ఈ ఇళ్లు నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం కేవలం ఇసుక మాత్రమే ఉచితంగా అందిస్తుంది అది కూడా ఇసుక రవాణాకు అయ్యే ఖర్చు లబ్ధిదారుడే భరించాలని కండిషన్ పెట్టింది. ఇస్తున్న ఇసుక కూడా ఎక్కడా నుంచి తెచ్చుకోవాలో స్పష్టత ఇవ్వడం లేదు.2022 జూన్ నాటికి 18 లక్షల 63,552 గృహాలు నిర్మిస్తామని చెప్పిన నాయకులు... ఇప్పటివరకు కేవలం 1,52,000 ఇళ్లను మాత్రమే నిర్మించారు ఇంత దయనీయ పరిస్థితి ఎందుకు వచ్చింది? పేదలను ఎందుకింత దగా చేశారు? ప్రజలకు ఈ వైసిపి ప్రభుత్వం సమాధానం చెప్పాలి అని డిమాండ్ చేశారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మూడున్నర సంవత్సరాల అవుతున్న అర్హులైనటువంటి పేదలకు ఇప్పటికీ ఇళ్లు కేటాయించకపోవడం, అర్హులైన పేదలకు ఇళ్లు వస్తాయో రావో అని అనుమానంతో అలాగే సొంత ఇళ్లు లేని పేదలు బాడుగ ఇళ్లలో ఉంటూ నెల నెల ఆర్థిక భారంతో ఇబ్బందులు పడుతున్నారని, పేదల కష్టాలు వైసీపీ ప్రభుత్వం కనబడడం లేదా అని ప్రశ్నించారు. ఆళ్ళగడ్డ నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో అనార్హులైనటువంటి వైసీపీ నాయకులు పాత ఇంటిని చూపిస్తూ కొత్త ఇళ్లు కట్టుకున్నామని, ప్రభుత్వం కేటాయించిన స్థలంలో కాకుండా ప్రైవేటు స్థలాలలో ఇళ్లు కట్టుకొని అవినీతితో, అక్రమాలకు పాల్పడుతున్నారని తెలియజేశారు. ఇప్పటికైనా అర్హులైనటువంటి పేదలందరికీ ఇళ్ల స్థలాల పట్టాలు త్వరగా ఇళ్లు పూర్తిచేసి అర్హులైన వారి పేరిట రిజిస్ట్రేషన్ చేయించి వెంటనే ఇవ్వాలని ఎమ్మెల్యే కు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు రాచంశెట్టి వెంకటసుబ్బయ్య, పశువుల నరేంద్ర యాదవ్, షేక్ షబ్బీర్ భాష, ఆంజనేయులు, బావికాడి గుర్రప్ప, సజ్జల నాగేంద్ర, దూలం చైతన్య తదితరులు పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com