కార్వేటి నగరం ( జనస్వరం ) : 2019 వైసిపి ప్రభుత్వం ఏర్పాటైనప్పటినుండి ఇప్పటివరకు నియోజకవర్గంలో భూ దందాలు, భూ అక్రమణులు నిరాటంకంగా కొనసాగుతూనే ఉన్నాయనీ జనసేన పార్టీ గంగాధర నెల్లూరు నియోజకవర్గ ఇన్చార్జి డాక్టర్ యుగంధర్ పొన్న తెలిపారు. మండలంలో ఇలాంటి సమస్యలు పునరావృతం అవుతూనే ఉన్నాయనీ మండల డిప్యూటీ తాసిల్దార్ కోమలకు వినతి పత్ర సమర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గత కొంతకాలంగా గొడుగు చింత పంచాయతీ తార్లబైలు సరిహద్దు ప్రాంతాల్లో విచ్చలవిడిగా ప్రభుత్వ భూములు ఆక్రమించుకుంటున్నారనీ, వీటిని అడ్డు కట్ట వెయ్యకపోతే భవిష్యత్తులో భూమిలేని నిరుపేదలకు సహాయం చేయటానికి ఒక సెంటు భూమి కూడా దొరకదనీ లేఖలో పొందుపరచారు. మండలంలో భూదంధాలు అరికట్టాలనీ, ప్రభుత్వభూమిని అక్రక్రమించేవారు శాపగ్రస్తులనీ భూ ఆక్రమణదారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నిరుపేదలకు మిగులు భూమి లేకుండా చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసారు. తార్ల బైలు ప్రాంతాన్ని సందర్శించి భూ అక్రమణ చేసే వారి మీద కఠినాతి కఠినమైన చర్యలు రెవిన్యూ చట్టపరిధిలో తీసుకొని ప్రభుత్వ భూములను కాపాడవలసిందిగా మండల తహశీల్దార్ ను విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో మండల ఉపాధ్యక్షులు సతీష్, జిల్లా సంయుక్త కార్యదర్శి కోలార్ వెంకటేష్, సీనియర్ నాయకులు శేఖర్ , కార్వేటినగరం మండలం ఉపాధ్యక్షులు విజయ్ పాల్గోన్నారు.