నెల్లూరు ( జనస్వరం ) : నెల్లూరు నగరంలోని వెంకటేశ్వరపురం వద్దనున్న టి డ్కో గృహాల వద్ద మౌలిక వసతులు కరువయ్యాయని జనసేన జిల్లా అధ్యక్షుడు చెన్నారెడ్డి మనుక్రాంత్ రెడ్డి పేర్కొన్నారు. సోమవారం నెల్లూరు నగరంలోని 54 వ డివిజన్ వెంకటేశ్వరపురం వద్దనున్న టీడ్కో గృహాల వద్ద జనం కోసం జనసేన మరియు భవిష్యతు గ్యారెంటీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా చెన్నారెడ్డి మనుక్రాంత్ రెడ్డి, నగర అధ్యక్షుడు దుగ్గిశెట్టి సుజయ్ బాబులు మాట్లాడుతూ చిన్నపాటి వర్షానికి డ్రైన్ లలోనే మురుగునీరు రోడ్లపై ప్రవహిస్తుందని అన్నారు. నీరు రోడ్డుపై పారడంతో దుర్వాసన వెదజల్లుతుందని తెలిపారు. పలు వీధుల్లో కూడా వీధి లైట్లు వెలగడం లేదన్నారు. చీకటి పడితే లైట్లు లేకపోవడంతో స్థానికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. కనీస సౌకర్యాలు అయిన సైడ్ డ్రైన్ లు, వీధి దీపాలు ఏర్పాటు చేయాలని కోరారు. లేని పక్షంలో జనసేన - తెలుగుదేశం ఉమ్మడి ప్రభుత్వంలో ఈ ప్రాంతం నుంచే అభివృద్ధి కార్యక్రమాలు చేస్తామని తెలిపారు. తొలుత ఇంటింటికీ వెళ్లి ప్రజలు ఎదుర్కుంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. త్వరలో జరగబోయే ఎన్నికల్లో జనసేన - టీడీపీ ఉమ్మడి అభ్యర్థిని ఆశీర్వదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో 54వ డివిజన్ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కొట్టె వెంకటేశ్వర్ , క్లస్టర్ ఇంఛార్జి షేక్ ఆలియా , డివిజన్ ఇంఛార్జి సుల్తాన్ బాషా, నాయకులు కుక ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com