సమస్యలు పరిష్కరించాలని కమీషనర్ కు వినతిపత్రం అందించిన కర్నూలు జనసేన నాయకుడు పవన్ కుమార్
కర్నూల్ నగరమునందు మున్సిపాలిటీ సమస్యల వల్ల ప్రజలు పడుతున్న ఇబ్బందులు కర్నూల్ కమీషనర్ గారికి తెలియచేసిన కర్నూల్ జిల్లా జనసేన నాయకుడు పవన్ కుమార్ మరియు కోడుమూరు నియోజకవర్గం నాయకుడు ఓబులేష్ పెట్టాలా గారు.
1. కర్నూలు నగరంలో గత కొన్ని రోజుల నుండి కురుస్తున్న వర్షాలకు నగరంలోని కొన్ని ప్రాంతాలలో అశోక్ నగర్ రైల్వే బ్రిడ్జి మరియు బ్లూమూన్ హోటల్ వద్ద మరియు జ్యోతి మాల్ నుండి నారాయణ మూర్తి పెట్రోల్ బంక్ వరకు మరియు ఇంద్ర గాంధీ నగర్ ఈ ప్రదేశాలలో డ్రైనేజీ వ్యవస్థ ప్రజలకు మరియు అటు నుంచి వెళ్లే వాహనదారులకు చాలా ఇబ్బందికరంగా మారింది.
2. జొహరాపురం నుండి కర్నూల్ నగరమునకు వచ్చు రహదారి వెంట అసంపూర్తిగా ఉన్న రోడ్డు డివైడర్ అలాగే అక్కడ కనీస లైటింగ్ సదుపాయం లేనందువల్ల వాహనదారులు ఆక్సిడెంట్లకు గురి అవుతున్నారు
3. నిత్యం వందల వాహనాలు మరియు ప్రాణాలు కాపాడే టువంటి అంబులెన్సులు తిరిగే ప్రదేశమైన కర్నూల్ నగరము లోని ప్రభుత్వ హాస్పిటల్ కు వెళ్ళు రోడ్డు చాలా గుంతలతో అలాగే కనీస లైటింగ్ సదుపాయం లేనటువంటి పరిస్థితుల్లో ఉన్నందువలన అటు నుంచి వెళ్లే వాహనదారులు కానీ అలాగే రోగులు చాలా ఇబ్బంది పడుతున్నారు.
ఇలా నగరంలోని చాలా రహదారులు గుంతలతో మరియు డ్రైనేజీ వ్వవస్థ సరిగా లేనందున మురుగునీరు రోడ్ లమీదగా ప్రవహిస్తూ కొన్ని ప్రదేశాలలో ఎటు నీరు వెళ్లలేక ఆగిపోవటం తో ప్రజలు అనారోగ్యము గురిఅవుతారు ఇపుడు వున్న పరిస్థితులలో కోవిద్ మహమ్మారి ప్రజల ప్రాణాలను బలిగొంటుంది.ప్రభుత్వము నేటి నుండి పాఠశాలలు కూడా తెరవటం తో పిల్లలు కూడా పాఠశాలలలకు వెళ్ళవలసిన ఈ పరిస్థితులలో మురుగు నీరు ఆగటం రహదారులు గుంతలతో నిడిపోవటం వలన ఒక పక్క మురుగునీరు రహదారులు గుంతలు పరిసరాలు అపరిశుభ్రత వుండటము వలన ప్రజలు తీవ్ర ఇబంధులకు గురిఅవుతున్నారు డ్రైనేజీ వవస్థను బాగుచేసి మరియు చెత్త కుండీల వద్ద బ్లీచింగ్ పౌడర్ మరియు దోమల మందు అన్ని ఏరియాలలో స్ప్రే చేయించాలని లేనియెడల ప్రజలు తీవ్రంగా అనారోగ్య పాలు అవుతారు. కావున ప్రభుత్వము వెంటనే చర్య తీసుకొన్ని సమస్యను పరిష్కరించవలసిందిగా గౌరవ కమిషనర్ గారిని జనసేన పార్టీ తరుపున కర్నూల్ జిల్లా నాయకులూ పవన్ కుమార్ ,కోడుమూరు నియోజకవర్గ నాయకులూ ఓబులేష్ ,మౌలాలి ,చిన్న శివ డిమాండ్ చేయటము జరిగింది.