తమ గ్రామానికి రోడ్డు వేయాలని అధికారులను విన్నవించిన కర్నూలు జిల్లా రాతన గ్రామ జనసైనికులు

తమ గ్రామానికి రోడ్డు వేయాలని అధికారులను విన్నవించిన కర్నూలు జిల్లా రాతన గ్రామ జనసైనికులు

                 కర్నూలు జిల్లా తుగ్గలి మండలంలో ఉన్నటువంటి రాతన గ్రామానికి జనసేన పార్టీ పత్తికొండ నియోజకవర్గ నాయకుడు రాజశేఖర్ గారు వెళ్లడం జరిగింది. అక్కడున్న వంటి ప్రధాన సమస్య ఎస్సీ కాలనీ మరియు బీసీ కాలనీ వాసులు సుమారు 60 కుటుంబాలకు పైగా వారికి ఉన్న ప్రధాన సమస్య రోడ్డు. ఈ రోడ్డు వెంట వెళ్లాలి ,రావాలి ,రోడ్డు ప్రక్కనే దేవాలయం మరియు ప్రాథమిక ఉన్నత పాఠశాల కూడా ఉన్నది. ఈ కాలనీ వాసులకు దారిలో మురికి నీరు నిలిచిపోవడంతో రాకపోకలకు చాలా ఇబ్బందికరంగా ఉందని జనసేన పార్టీ దృష్టికి తీసుకురావడం జరిగింది. అక్కడికి వెళ్ళి జనసేన పార్టీ నాయకులు రాజశేఖర్ , ఇస్మాయిల్, నూరు భాషా, శ్రీధర్ అక్కడికి వెళ్లి కాలనీ వాసులతో మాట్లాడి అదేవిధంగా వారితో సంతకాలు సేకరించి తుగ్గలి ఎంపీడీవో గారిని కలిసి వినతి పత్రం ఇవ్వడం జరిగింది.  తుగ్గలి సూపరిడెంట్ పార్థసారథి గారితో మాట్లాడి ఆ కాలనీ వాసులకు సిసి రోడ్డు చేయించి వారి సమస్యలు పరిష్కరించాలని జనసేన పార్టీ తరఫున కోరడమైనది.  వారు స్పందించి మేము ఒక నెల రోజుల లోపల సిసి రోడ్డు వేసి వారి బాధను తీరుస్తానని హామీ ఇవ్వడం జరిగింది. జనసేన నాయకులు మాట్లాడుతూ అధికారంలో లేకపోయినా నిరంతరం సమస్యల పై పోరాడే పార్టీ మన జనసేన పార్టీ. ఇప్పుడున్న రాజకీయ నాయకులు వారి సొంత పనుల కోసం అన్ని అడ్డదారులు తొక్కుతున్నారు. ఈ రహదారి నిర్మాణానికి చాలాసార్లు డబ్బు బిల్లులు మంజూరు అయినా అధికారులు స్థానిక రాజకీయ నాయకులతో కుమ్మక్కయ్యి అభివృద్ధి శూన్యం చేస్తున్నారు. కనుక ఇప్పటికి అయిన సమస్యను త్వరగా పరిష్కరించాలని వినతిపత్రం ఇవ్వడం జరిగింది. సమస్య ఏది ఉన్న ముందుగా గుర్తొచ్చే పార్టీ జనసేన పార్టీ అనే విధంగా ప్రజలలో ముద్ర వేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు మరియు గ్రామ సభ్యులు పాల్గొనడం జరిగింది. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way