కర్నూల్ జిల్లా రాష్ట్ర చిరంజీవి యువత, జనసైనికులు కలసి ఆశ్రమంలో అన్నదానం
కర్నూల్ జిల్లా రాష్ట్ర చిరంజీవి యువత తరుపున మెగాస్టార్ శ్రీ చిరంజీవి గారి జన్మదిన వేడుకల్లో భాగంగా 4వ రోజు కర్నూల్ నగర కీర్తన ఆశ్రమంలోని 50 మంది చిన్నారులకు కర్నూల్ జనసేన పార్టీ నాయకులు శ్రీ పవన్ కుమార్ గారి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం చెయ్యటం జరిగింది. పవన్ కుమార్ మాట్లాడుతూ చిరంజీవి గారు సినిమా రంగంలో ఎంతో సేవ చేశారని, అలాగే ప్రజా సంక్షేమం కూడా గర్వించదగ్గ చేశారని అన్నారు. ఇపుడు జనసేనాని పవన్ కళ్యాణ్ గారి ఆశయ సాధనలో సేవా కార్యక్రమాలు చేస్తూ పార్టీని బలోపేతం చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీ చిరంజీవి మరియు శ్రీ పవన్ కళ్యాణ్ గారి అభిమానులు, జనసైనికులు పాల్గొని విజయవంతం చేశారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com