Logo
Date of Publish : 28 January 2022, 2:07 pm
Editor : Sake Naresh

కర్నూలు జిల్లాకు దామోదరం సంజీవయ్య గారి పేరు పెట్టాలి : కర్నూలు జిల్లా జనసేన నాయకులు

    పాణ్యం, (జనస్వరం) :  కర్నూలు జిల్లా పాణ్యం నియోజకవర్గ జనసేన పార్టీ ఇంఛార్జ్ శ్రీ చింతా సురేష్ బాబు గారు జనసేన పార్టీ కార్యాలయంలో ప్రెస్ మీట్ నిర్వహించి మా జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు కర్నూలు జిల్లాకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కీర్తిశేషులు గౌరవనీయులు దామోదరం సంజీవయ్య గారి పేరును ప్రతిపాదించిన విధంగా పెట్టాలని డిమాండ్ చేశారు. మీ తండ్రి గారి పేరు కడప జిల్లా కు, మీ తండ్రిగారికి మీకు మిత్రులైన ఎన్టీఆర్ గారి పేరు కృష్ణ జిల్లాకు పెట్టినప్పుడు కర్నూలు జిల్లాకు దామోదరం సంజీవయ్య గారి పేరు పెట్టడానికి ఏం అభ్యంతరం మీరు కొత్త జిల్లాలు ఏర్పాటు చేయాలి అని అనుకుంటే తప్పకుండా కర్నూలు జిల్లాకు ఆయన పేరు పెట్టాలని జగన్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.అనంతరం కర్నూలు జిల్లా వివిధ నియోజకవర్గాల నాయకులతో, జనసైనీకులతో తదుపరి కార్యాచరణ ప్రణాళికల గురించి సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ మత్స్యకార విభాగ రాష్ట్ర కార్యదర్శి తెలుగు గోవింద రాజు, కర్నూలు జనసేన వీర మహిళ అనిత శ్రీ , పాణ్యం నియోజకవర్గ నాయకులు పోలురి బాల వెంకట సుబ్బయ్య, టి.మంజునాథ్, వై.బజార్, సుధాకర్, మైనారిటీ నాయకులు కె.ఎం.డి.షబ్బీర్, కొండల్, నరసింహులు, సతీష్, భాస్కర్. డోన్ నియోజకవర్గ నాయకులు బాలు యాదవ్, పత్తికొండ నియోజకవర్గ నాయకులు గొవిందు, కోడుమూరు నియోజకవర్గ నాయకులు ఆకెపోగు రాంబాబు, కృష్ణ బాబు, శ్రీనివాస్ రెడ్డి, నందికొట్కూరు నియోజకవర్గ నాయకులు జనసేన రాము మరియు జనసైనీకులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com