Logo
Date of Publish : 13 November 2020, 10:20 am
Editor : Sake Naresh

కర్నూల్ జిల్లా నంద్యాల ఘటన పాశవికం, అమానుషం : జనసేన రాయలసీమ జాయింట్ కన్వీనర్, కడప అసెంబ్లీ ఇంచార్జ్ సుంకర శ్రీనివాస్

కర్నూల్ జిల్లా నంద్యాల ఘటన పాశవికం, అమానుషం : జనసేన రాయలసీమ జాయింట్ కన్వీనర్, కడప అసెంబ్లీ ఇంచార్జ్ సుంకర శ్రీనివాస్

             ఈ నెల 3 వ తేదీన అబ్దుల్ సలాం అనే వ్యక్తి అతని కుటుంబం ట్రైన్ కింద పడి ఆత్మహత్య చేసుకున్నారని ఇంత హృదయ విధారకరమైన ఘటన చాలా బాధాకరమన్నారు. ఏపీలో పోలీసు వ్యవస్థ ఎలా పనిచేస్తుందన్న దానికి నిదర్శనం నంద్యాల ఘటన అని, ప్రతిపక్ష పార్టీల నాయకుల పై పోలీసులు అక్రమ కేసులు పెడుతున్నారని ఇక సామాన్యుల పరిస్థితి ఏంటో అందరికీ తెలిసిందేనన్నారు. చేతులు కాలిన తరవాత ఆకులు పట్టుకున్న చందంగా ప్రస్తుత ప్రభుత్వ తీరు ఉందన్నారు. మొత్తం కుటుంబం ఆత్మహత్య చేసుకుందని, ఇప్పుడు న్యాయం చేయటానికి వారి కుటుంబమే లేదన్నారు. ఆత్మహత్యకు కారకులైన పోలీసులను సస్పెండ్ చేయడం కాదని వారికి కఠినమైన శిక్ష పడేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. ఇలాంటి ఘటనలు రాష్ట్రంలో ఎన్నో జరుగుతున్నాయని ఇప్పటికైనా సీఎం జగన్ కళ్ళు తెరవాలన్నారు. అవినీతి రహిత పాలన అన్న జగన్ మాటలు ఏమయ్యాయని, ఇలాంటి ఘటనలు పునరావృత్తం కాకుండా చూడాలని ప్రభుత్వానికి జనసేన తరపున విజ్ఞప్తి చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో కడప నగర అధ్యక్షుడు మాలే శివ, చిరంజీవి ఫ్యాన్స్ అధ్యక్షుడు తాజ్ షరీఫ్, నగర్ కార్యదర్శి గజ్జల సాయి, సురేష్ బాబు నాగరాజు సందీపు శేషు పాల్గొన్నారు. 


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com