ఆళ్లగడ్డ, (జనస్వరం) : మానవత్వానికి పర్యాయపదం సేవా గుణానికి నిజమైన నిర్వచనం ఆపదలో ఉన్న వారికి తక్షణ సాయం అందించడం ఏకైక లక్ష్యంతో నిర్విరామంగా కృషి చేస్తూ అన్ని వర్గాల ప్రజల నుంచి విశేష ప్రశంసలు అందుకుంటున్న సీనియర్ న్యాయవాది జనసేన జిల్లా ప్రధాన లీగల్ కార్యదర్శి దాది రెడ్డి మధుసూదన్ గారు. చాగలమర్రి మండలం ముత్యాలపాడుకు చెందిన నడివీధి రాజమ్మ గత కొన్ని సంవత్సరాల నుండి ముత్యాలపాడు బస్టాండ్ లో అనాధగా ఉండేది. ఆమెకు ఎవరి సహకారం లేకపోవడంతో ఒంటరిగా బస్ స్టాప్ లోనే ఉంటూ జీవనం సాగిస్తూ ఉండేది. ఈ విషయాన్ని గమనించిన చక్రవర్తుల పల్లె గ్రామానికి చెందిన జనసేన నాయకుడు సుబ్బయ్య, దాది రెడ్డి మధుసూదన్ తెలపగా స్పందించిన ఆయన మానవతా దృక్పథంతో ఆళ్లగడ్డ పట్టణంలో సత్య రూరల్ నిరాశ్రయుల వసతి గృహం నిర్వాహకుడు ప్రదీప్ తో సంప్రదించి, ముత్యాలపాడు నుండి తన వాహనంలోనే రాజమ్మ ను వెంట తీసుకొని వచ్చి నిరాశ్రయుల వసతి గృహంలో చేర్పించారు. ఆమెకు సంబంధించి వస్త్రాలు అందజేసి మానవత్వానికి నిర్వచనంగా దాది రెడ్డి మధుసూదన్ నిలిచారు. ఈ సందర్భంగా పలువురు ఆయనను ప్రశంసించారు. అలాగే చక్రవర్తుల పల్లె జనసేన నాయకుడు సుబ్బయ్య, మడ్డీ దిలీప్ కుమార్ ప్రసంగి , ఆదాం, ముత్యాలపాడు గ్రామానికి చెందిన వీరందరినీ గ్రామానికి చెందిన పలువురు అభినందించారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com