Logo
Date of Publish : 25 November 2023, 10:05 pm
Editor : Sake Naresh

జనసేన పార్టీ అభ్యర్థి వంగ లక్ష్మణ్ గౌడ్ కు మద్దతుగా కర్నూలు జిల్లా జనసేన నాయకులు

        నాగర్ కర్నూల్ ( జనస్వరం ) : నాగర్ కర్నూల్ జనసేన పార్టీ అభ్యర్థి వంగ లక్ష్మణ్ గౌడ్ కు మద్దతుగా కర్నూల్ జిల్లా జనసేన నాయకులు, వీర మహిళలు వెళ్ళి ప్రచారం నిర్వహించారు.  సిజి రాజశేఖర్ మాట్లాడుతూ నాగర్ కర్నూల్ నందు పోటీ చేసిన బీసీ బిడ్డ వంగ లక్ష్మణ్ గౌడ్ కి కేటాయించిన గాజు గ్లాస్ గుర్తుపై మీ అమూల్యమైన ఓటు వేసి వేయించి గెలిపించాల్సిందిగా కోరారు. రాజకీయాల్లో అందరూ స్వార్ధం నిండిన సమాజం.. కుయుక్తులు పన్నే నాయకులు.. రంగులు మార్చే రాజకీయం, ఇదీ నేటి వ్యవస్థ. అస్తవ్యస్తమైన రాజకీయాల్లోకి నిస్వార్ధమైన మనసుతో.. కళంకం లేని వ్యక్తిత్వంతో.. సమాజానికి మేలు జరగాలనే ఏకైక లక్ష్యంతో రాజకీయాల్లోకి వచ్చిన వ్యక్తి  పవన్ కల్యాణ్ అన్నారు. సినిమా స్టార్ అయినా.. అశేష ప్రజాభిమానాన్ని లబ్దిగా చూడకుండా నా తెలుగు ప్రజలకు మంచి చేయాలనే తలంపుతో జనసేన పార్టీ స్థాపించి అలుపెరుగని పోరాటం చేస్తున్న జననేత పవన్ కల్యాణ్ అని అన్నారు. ఆయన స్ఫూర్తితో రాజకీయాల్లోకి వచ్చి ప్రజా సమస్యలపై ఎప్పటికప్పుడు పోరాడుతూ నియోజకవర్గంలో ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉండే, యువ కెరటం వంగ లక్ష్మణ్ గౌడ్, ఈ పోరాటాల గడ్డ తెలంగాణలో జరుగుతున్న ఎన్నికల సమరంలో నాగర్ కర్నూల్ నియోజకవర్గంలో జనసేన – బీజేపీ ఉమ్మడి అభ్యర్ధిగా వంగ లక్ష్మణ్ గౌడ్ ని ఎన్నికల బరిలో నిలిచారు. వారిని అత్యధిక మెజారిటీతో గెలిపించి తెలంగాణ శాసనసభకు పంపించాలని.. ప్రజల సమస్యలు బలంగా మాట్లాడగల వ్యక్తి  వంగ లక్ష్మణ్ గౌడ్ ఇలాంటి వ్యక్తి విజయానికి ప్రతి మెగాభిమాని, జనసైనికులు కలసికట్టుగా పని చేసి జనసేన విజయానికి కృషి చేద్దామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మిగనూరు జనసేన ఇంచార్జ్ రేఖా గౌడ్ తదితరులు పాల్గొన్నారు. 


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com