కర్నూలు ( జనస్వరం ) : పెంచిన విద్యుత్ చార్జీలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ.. జనసేన పార్టీ ఆధ్వర్యంలో జిల్లావ్యాప్తంగా నాయకులు, కార్యకర్తలు తరలివచ్చి కర్నూలు నగరంలోని అంబేద్కర్ భవన్ నుండి కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించి ధర్నా నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ధర్నాను ఉద్దేశించి జనసేన పార్టీ పాణ్యం నియోజకవర్గ ఇన్చార్జి చింతాసురేష్ బాబు మాట్లాడుతూ చార్జీలను విపరీతంగా పెంచి సామాన్య మధ్యతరగతి కుటుంబాల పై మోయలేని భారం మోపుతున్నారని ఆయన తీవ్రంగా విమర్శించారు. ఇప్పటికే పెరిగిన ధరలతో జనం అల్లాడిపోతున్నారు అని, దీనికితోడు విద్యుత్ చార్జీలు కూడా పెంచితే పేద ప్రజలు ఎలా భరిస్తారు అని అన్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఇటీవలే కరెంటు చార్జీల మోత మోగింది అని, పది రోజుల క్రితం తెలంగాణలో కరెంటు చార్జీలు భారీగా పెరిగాయి అని ఏపీలో కూడా విద్యుత్ చార్జీలను విపరీతంగా పెంచేశారు అని ఆయన తీవ్రంగా విమర్శించారు. సామాన్య మధ్యతరగతి కుటుంబాలు కొనలేని విధంగా నిత్యావసర సరుకుల ధరలు కూడా విపరీతంగా పెంచేశారు అని అన్నారు. చార్జీల మోత మోగిస్తుంటే.. మరోవైపు నిత్యావసర సరుకుల ధరలు వాత పెడుతున్నాయి అని అన్నారు. ఈ కార్యక్రమంలో అర్షద్, ఎమ్మిగనూరు ఇన్చార్జి రేఖా జావాజి, పవన్, ఆదోని ఇంచార్జ్ మల్లప్ప, పోలూరి వెంకట సుబ్బయ్య, చల్ల వరుణ్, శీను, రాము, అనిత శ్రీ, సుధాకర్, బ్రహ్మం మరియు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.