గుంతకల్ ( జనస్వరం ) : జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమం గుంతకల్ పట్టణం, మండలంలో ముఖ్య భూమిక వహించి అత్యధిక సభ్యత్వాలు చేసిన క్రియా వాలంటీర్లకు జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించడం జరిగింది. ఈ సందర్భంగా వాసగిరి మణికంఠ మాట్లాడుతూ జనసేన పార్టీ జెండా పట్టుకున్న ప్రతి జనసైనికుడికి భద్రతా భవితవ్యం కోసం అండగా ఉండేలా అనే ఉద్దేశంతో జనసేనాని తలపెట్టిన మహత్తర కార్యక్రమం "క్రియాశీలక సభ్యత్వ" నమోదు కార్యక్రమం. దశాబ్దాల తరబడి ఉన్న రాజకీయ పార్టీలు కార్యకర్తలా బాగు కోసం ఆలోచన చేయలేదు, కానీ జనసేనాని ప్రతి ఒక్క జన సైనికుడికి ప్రమాద బీమా 5 లక్షలు ఆరోగ్య బీమా 50 వేలు రూపాయలు చేయించి కార్యకర్తల పట్ల తనకున్న బాధ్యతను తెలియజేశారు. అలాంటి నిస్వార్థ నాయకుడు పవన్ కళ్యాణ్ గారిని 2024లో ముఖ్యమంత్రిని చేసుకునే అంతవరకు ప్రతి ఒక్కరూ శ్రమించాలని పిలుపునిచ్చారు. ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా, రైతన్న రారాజు కావాలన్నా, నిరుద్యోగ యువత పారిశ్రామికవేత్తలుగా మారాలన్నా, జాబ్ క్యాలెండర్ రావాలన్నా, మహిళలకు 33% రాజకీయ రిజర్వేషన్ రావాలన్నా, ఎస్టి, ఎస్సి, బీసీ మైనార్టీ వర్గాలు వారు అభ్యున్నతి చెందాలన్నా పవన్ రావాలి, పాలన మారాలి అని ఉద్ఘటించారు. ఈ కార్యక్రమంలో వీరమహిళ శ్రీమతి బండి చంద్రకళ గుంతకల్ పట్టణ, మండల అధ్యక్షులు బండి శేఖర్, కురువ పురుషోత్తం జిల్లా కార్యక్రమాల నిర్వహణ కమిటీ సభ్యులు పవర్ శేఖర్, ఎస్. కృష్ణ గుంతకల్ చిరంజీవి యువత అధ్యక్షుడు పాండు కుమార్ సీనియర్ నాయకులు విశ్రాంత రైల్వే ఉద్యోగి కప్పట్రాళ్ల కోటేశ్వరరావు, ఆటో రామకృష్ణ, కసాపురం నందా, బుర్ర అఖిల్ రాయల్, దాసరి వంశీ క్రియాశీలక సభ్యులు హరి ప్రసాద్, రామకృష్ణ, శ్రీనివాసులు, సూర్యనారాయణ, అమర్, పవన్ లారెన్స్ క్రియా వాలంటీర్లు, జనసైనికులు తదితరులు పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com