ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర దేవాదాయ శాఖ ధర్మాదాయ మంత్రి వెల్లంపల్లి గారికి కమర్షియల్ కాంప్లెక్స్ ల పిచ్చి పట్టింది. బడి- గుడి మహా నాయకుల విగ్రహాలు తొలగించి కాంప్లెక్స్ నిర్మించడం ఎంత వరకు సమంజసం? అని ఆయన అన్నారు. జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి మరియు పశ్చిమ నియోజకవర్గ ఇంఛార్జ్ శ్రీ పోతిన వెంకట మహేష్ గారు రజక వీధి లోని మున్సిపల్ పాఠశాలను మరియు చిత్తూరు కాంప్లెక్స్ ఎదురుగా ఉన్న మున్సిపల్ కార్యాలయాన్ని బిజెపి మాజీ కార్పొరేటర్ ఉత్తమ్ చంద్ బండారి మరియు జనసేన నాయకులు కత్తి డేవిడ్, కొరగంజి రమణ, పొట్నురి, ప్రసాద్, బేతాళం, రవికుమార్, మోభినా, రాజులతో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా మహేష్ గారు మాట్లాడుతూ మున్సిపల్ కార్పొరేషన్ పాఠశాలలో విద్యార్థుల సంఖ్యను పెంచే విధంగా చర్యలు తీసుకోకుండా విద్యార్థులు తక్కువగా ఉన్నారనే సాకుతో వేరే పాఠశాలకు బదిలీ చేస్తూ మున్సిపల్ పాఠశాల ప్రాంగణాన్ని అభివృధి పేరుతో కబ్జా చేసి కమర్షియల్ కాంప్లెక్స్ నిర్మాణం చేసి శాశ్వత ఆదాయ వనరుగా మార్చుకోవాలన్నా మంత్రి ఆలోచనను వారి రబ్బర్ స్టాంప్ మేయర్ గారి ద్వారా అమలు చేసే దిశగా అడుగులు వేస్తున్నారని ఇది చాలా దుర్మార్గమన్నారు. ఆ ప్రాంతంలో చిరు వ్యాపారాలు మరియు బండ్ల మీద వ్యాపారం చేసుకునే వారి యొక్క పిల్లలకు ఈ పాఠశాలలో విద్యాబుద్ధులు నేర్పించి ఉన్నత స్థాయికి తీసుకెళ్లే విధంగా ఆలోచన చేయకుండా సొంత ప్రయోజనాల కోసం ఇటువంటి కుట్రలు చేస్తున్నారని, ఈ పాఠశాల ప్రాంగణంలో ఉన్న కోదండరాముని ఆలయాన్ని , అదేవిధంగా మహాత్మాగాంధీ, పొట్టి శ్రీరాములు గార్ల విగ్రహాల్ని స్వార్థం కోసం తొలగించేందుకు కూడా సిద్ధమయ్యారన్నారు. గాంధీ మున్సిపల్ హైస్కూల్ ఆవరణలో ఉన్న మున్సిపల్ కార్యాలయాన్ని కూడా కమర్షియల్ కాంప్లెక్స్ గా నిర్మాణం చేయడం ఎవరి ప్రయోజనాల కోసం సమాధానం చెప్పాలని మహేష్ గారు డిమాండ్ చేశారు. కార్పొరేషన్ స్థలాలను అభివృద్ధి పేరుతో కమర్షియల్ కాంప్లెక్స్ లను శాశ్వత ఆదాయ వనరుగా మార్చు కోవాలి అనుకున్న మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ గారి ఆలోచన ప్రజలు గ్రహించాలని ఆయన సామాన్య ప్రజల కోసం కాకుండా కేవలం డబ్బు సంపాదన మీద దృష్టి పెట్టి నియోజకవర్గ అభివృద్ధి గాలికొదిలేశారని వారి నిజస్వరూపాన్ని ప్రజలు గ్రహించాలి అన్నారు. మేయర్ గారు ముందు మీరు చిట్టినగర్ దగ్గర గోతులు పడ్డ రోడ్లు మరమ్మతులు చేయడం మీద దృష్టి సారించాలని, నగర ప్రజలపై జీవో నెంబర్ 198 ద్వారా ప్రజలపై పన్ను భారం పడకుండా కౌన్సిల్ లో తీర్మానం చేయడం మీద దృష్టి సారించాలన్నారు. ఈ కార్యక్రమములో శ్రీ పోతిన వెంకట మహేష్ గారితో పాటు జనసేన నాయకులు మరియు జనసైనికులు తదితరులు పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com