Logo
Date of Publish : 25 June 2022, 12:02 pm
Editor : Sake Naresh

పెనుగంచిప్రోలు గ్రామంలో జనసేనపార్టీ జెండాను ఆవిష్కరించిన కృష్ణా జిల్లా అధ్యక్షులు బండ్రేడ్డి రామకృష్ణ

     జగ్గయ్యపేట, (జనస్వరం) : జగ్గయ్యపేట నియోజకవర్గం పెనుగంచిప్రోలు మండలం పెనుగంచిప్రోలు గ్రామములో పెనుగంచిప్రోలు జనసేనపార్టీ అధ్యక్షులు తునికాపాటి శివ ఆధ్వర్యంలో జనసేన పార్టీ జెండా దిమ్మెను  ఉమ్మడి కృష్ణా జిల్లా జనసేనపార్టీ అధ్యక్షులు బండ్రేడ్డి రామకృష్ణ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ జనసేనపార్టీ అధికారంలోకి వస్తే రైతులకు, మహిళలకు భవన కార్మికులకు, కార్మికులకు, విద్యార్థులకు, నిరుద్యోగులకు ప్రతిఒక్కరికి న్యాయం జరుగుతుందని అన్నారు. ఈ వైసీపీ పాలన అరాచకాలు ప్రతి ఒక్కరు బాధపడుతున్నారు. ఒకవైపు ఇసుకమట్టి మాఫియా, ఇంకో వైపు ఆడపిల్లలకు రక్షణ లేదు నియంత పాలన చేస్తుంది ప్రజలు ఏమైయి పోతే మాకు ఏంటి అని ప్రభుత్వం వ్యవరిస్తుంది అని ఘాటుగా విమర్శలు చేసారు. అలాగే జిల్లా ఉపాధ్యక్షులు బొలియశెట్టి శ్రీకాంత్ మాట్లాడుతూ అమ్మ ఒడి ఎగ్గిగొట్టాలని రాష్ట్రంలో విద్యార్థులు జీవితాలతో ఈ ప్రభుత్వం అడుకొంటుందని, మొన్న టెన్త్, ఇంటర్ విద్యార్థులు పలితాలు చూస్తే తెలుస్తుంది ఎంత మంది పెయిల్ అయ్యారో ప్రజలు అందరికి తెలుసు ఎప్పుడు లేని విధంగా ఈ సంవత్సరం పెయిల్ అయ్యారు. పెయిల్ అయిన విద్యార్థులకు అమ్మ ఒడి ఇవ్వక్కర లేదని ఇది వైసీపీ పక్క ప్లాన్ మీద వెళ్లారు. వేలా కోట్లు మిగులుతుంది అని, అలాగే జనసేనపార్టీ అధికారంలోకి వస్తే మహిళకు గ్యాస్ సిలెండర్లు, రేషన్ బదులు మీ బ్యాంక్ ఖాతాలోకి 2500 నుండి 3500 రూపాయిలు వేస్తాం, మహిళకు రక్షణ కల్పిస్తాం, నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాం, రైతులకు గిట్టుబాటు ధరలు ఇస్తాం, 60 సంవత్సరములు దాటినా రైతులకు 5వేలు పింఛన్ జనసేనపార్టీ ఇస్తుంది అని శ్రీకాంత్ తెలిపారు. పెన్నా-కృష్ణ కో-ఆర్డినేటర్ రావి సౌజన్య మాట్లాడుతూ 30 కోట్లు పెట్టి 3 వేల మంది కౌలు రైతులకు జనసేనపార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్  సొంత డబ్బులతో ఇస్తున్నారు. ఇంతవరకు ఏ రాజకీయా నాయకులు ఇవ్వలేదు. రైతులు కష్టాలు పవన్ కళ్యాణ్ కి తెలుసు కాబట్టి రైతులు బాగుండాలని ఈ నిర్ణయం తీసుకొని చనిపోయిన కౌలు రైతుకు లక్ష రూపాయలు ఇస్తున్నారు. కరెంటు రేట్లు పెంచేశారు. నిత్యావసర వస్తువులు పెంచేశారు. ఇసుక రేట్లు పెంచారు ఇలా పెంచుకుంటూ పోతే సామాన్యులు ఎలా బ్రతుకుతారు అని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి బడిసా మురళి, కార్యదర్శి చింతల లక్ష్మీ, సంయుక్త కార్యదర్శి ఇమని కిషోర్ నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు, మండల కమిటీలు తునికాపాటి శివ, గోపినాద్, నరసింహరావు, మండల కమిటీ సభ్యలు, జనసేపార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com