
కృష్ణా, (జనస్వరం) : కృష్ణాజిల్లా నందిగామ మండలం అనాసాగరం హై స్కూల్ లో విద్యుత్ షాక్ తో మృతి చెందిన దారం గోపి అనే విద్యార్థి తల్లిదండ్రులను కృష్ణా జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడు బండ్రెడ్డి రామకృష్ణ గారు పరామర్శించారు. తల్లిదండ్రులను ఓదార్చి మీకు జనసేన పార్టీ అండగా ఉంటుందని రామకృష్ణ గారు తెలిపారు. ఈ సందర్భంగా పిల్లలతో వెట్టి చాకిరీ చేయించడం నేరం అయినప్పటికీ ఉపాధ్యాయుల ఇలా చేయడం దారుణం అని తెలిపారు. నాడు నేడు పనులతో నిధుల ఖర్చు పెట్టడం కాదు, పాఠశాల శుభ్రం కోసం ఒకరిని నియమించాలి అని అన్నారు. పాఠశాలలో వాచ్ మెన్ ఉండి ఉంటే ఈరోజు గోపి ప్రాణాలతో ఉండేవాడు అని అన్నారు. ప్రభుత్వము ప్రచార ఆర్భాటాలు కోసం కాదు శాశ్వత పరిష్కారం కోసం నిధులు ఖర్చు చేయాలన్నారు. గోపి కుటుంబానికి అధికారులు, నాయకులు ఇచ్చిన హామీలను 30 రోజులలో నిలబెట్టుకోవాలని రామకృష్ణ గారు అన్నారు. వీటిలో ఏ ఒక్క హామీ నెరవేర్చకపోయినా జనసేన పార్టీ తరుపున ఆందోళనలు చేపడతాము అని బండ్రెడ్డి రామకృష్ణ గారు తెలిపారు. ఈ కార్యక్రమములో జనసేన నాయకులు, జనసైనికులు తదితురులు పాల్గొన్నారు.