Logo
Date of Publish : 27 August 2021, 5:37 am
Editor : Sake Naresh

విద్యుత్ షాక్ తో మృతి చెందిన దారం గోపి తల్లిదండ్రులను పరామర్శించిన కృష్ణా జిల్లా జనసేన నాయకులు

       కృష్ణా, (జనస్వరం) :  కృష్ణాజిల్లా నందిగామ మండలం అనాసాగరం హై స్కూల్ లో విద్యుత్ షాక్ తో మృతి చెందిన దారం గోపి అనే విద్యార్థి తల్లిదండ్రులను కృష్ణా జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడు బండ్రెడ్డి రామకృష్ణ గారు పరామర్శించారు. తల్లిదండ్రులను ఓదార్చి మీకు జనసేన పార్టీ అండగా ఉంటుందని రామకృష్ణ గారు తెలిపారు. ఈ  సందర్భంగా పిల్లలతో వెట్టి చాకిరీ చేయించడం నేరం అయినప్పటికీ ఉపాధ్యాయుల ఇలా చేయడం దారుణం అని తెలిపారు. నాడు నేడు పనులతో నిధుల ఖర్చు పెట్టడం కాదు, పాఠశాల శుభ్రం కోసం ఒకరిని నియమించాలి అని అన్నారు. పాఠశాలలో వాచ్ మెన్ ఉండి ఉంటే ఈరోజు గోపి ప్రాణాలతో ఉండేవాడు అని అన్నారు. ప్రభుత్వము  ప్రచార ఆర్భాటాలు కోసం కాదు శాశ్వత పరిష్కారం కోసం నిధులు ఖర్చు చేయాలన్నారు. గోపి కుటుంబానికి అధికారులు, నాయకులు ఇచ్చిన హామీలను 30 రోజులలో నిలబెట్టుకోవాలని రామకృష్ణ గారు అన్నారు. వీటిలో ఏ ఒక్క హామీ నెరవేర్చకపోయినా జనసేన పార్టీ తరుపున ఆందోళనలు చేపడతాము అని  బండ్రెడ్డి రామకృష్ణ గారు తెలిపారు. ఈ కార్యక్రమములో జనసేన నాయకులు, జనసైనికులు తదితురులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com