Logo
Date of Publish : 18 March 2023, 4:56 pm
Editor : Sake Naresh

పేద కుటుంబానికి10 వేలు ఆర్థిక భరోసా ఇచ్చిన KR Young Indian trust

           పెందుర్తి ( జనస్వరం ) : నియోజకవర్గంలో ఇటీవల ప్రమాదవశాత్తు మరణించిన కీర్తిశేషులు ఇల్లపు శ్రీనివాస రావు గారు కుటుంబాన్ని పరామర్శించిన KR Young Indian trust సభ్యులు ముఖ్య అతిథిగా పాల్గొన్న KR Admin నవీన్ పెద్దమల్ల చేతుల మీదుగా 10 వేల ఆర్థిక భరోసా ఇవ్వడం జరిగింది. నవీన్ గారు మాట్లాడుతూ నరవ గ్రామంలో ప్రమాదవశాత్తు ఇల్లపు శ్రీనివాస్ రావు గారు మరణించారని విషయాన్ని స్థానిక అడ్మిన్ మాకు తెలియజేయగానే వెంటనే మా పెద్దలు శివ భాస్కరరావు గారికి తెలియజేసి వారు ఆమోదంతో పెందుర్తి నియోజకవర్గం లో ఉన్న దాతలు సహకారంతో వారి కుటుంబాని పరామర్శించి 10 వేల ఆర్థిక భరోసా ఇవ్వడం జరిగిందని అన్నారు. వారి సతీమణికి ఏదైనా ఉద్యోగం ఇప్పించమని స్థానిక ప్రజలు కోరడం జరిగిందని తప్పకుండా మా వంతు ఉద్యోగం వచ్చేలాగా కృషి చేస్తామని మాట్లాడారు. స్థానిక అడ్మిన్ శ్రీకాంత్ గారు మాట్లాడుతూ సమస్య ఎక్కడున్నా KR అక్కడ ఉంటుందని, సామాన్య ప్రజలు ఎప్పుడు కష్టాల్లో ఉన్న యంగ్ ఇండియన్ ట్రస్ట్ సహకారం అక్కడ ఉంటుందని మరొక్కసారి ఈ కార్యక్రమం రుజువు చేసిందని, అతి తక్కువ సమయంలోనే పెందుర్తి పరవాడ సబ్బవరం మండల వాట్సాప్ గ్రూపులో ఈ విషయాన్ని తెలియజేయగానే క్రౌడ్ ఫండింగ్ ద్వారా 10 వేలు రూపాయలు సమకూరిందని అన్నారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న దాతలందరూ ప్రత్యేక ధన్యవాదాలు, మమ్మల్ని నడిపిస్తున్న KR ఫౌండర్ శ్రీ పెద్దిరెడ్డి శివ భాస్కర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలపడం జరిగింది. గల్లా శ్రీనివాసరావు మాట్లాడుతూ కష్టాల్లో ఉన్న ప్రజలకు కేఆర్ అండగా ఉంటుందని ఎంతోమందికి నిరుద్యోగ యువతకి ఉద్యోగాలు కల్పించబడ్డాయని దయచేసి శ్రీనివాస్ గారు సతీమణి గారు కూడా ఒక ఉద్యోగం ఇవ్వగలిగితే వారి మనుగడకు ఉపయోగపడుతుంది KR సభ్యులను కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో స్థానిక గ్రామ సభ్యులు గళ్ళ శ్రీనివాస్, గవర త్రిమూర్తులు, వబ్బిన జనార్థన శ్రీకాంత్, బొడ్డు నాయుడు, గవర శ్రీను, రాజేష్, దొరబాబు పాల్గొని కుటుంబాన్ని ఆదుకున్న KR దాతలకు మరియు KR ఫౌండర్ పెదిరెడ్డి శివ భాస్కర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలపడం జరిగింది.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com