Logo
Date of Publish : 08 June 2026, 6:34 am
Editor : Sake Naresh

యువతకు స్ఫూర్తిగా కొవ్వలి క్రికెట్ పోటీలు

- విజేతగా భక్తాంజనేయ టీం
- రూ.15 వేలు నగదు బహుమతి
దెందులూరు, జూన్ 7 (జనస్వరం) : కొవ్వలి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మైదానంలో భక్తాంజనేయ యూత్ ఆధ్వర్యంలో నిర్వహించిన క్రికెట్ పోటీలు అట్టహాసంగా ముగిశాయి. ఫైనల్ మ్యాచ్‌లో భక్తాంజనేయ క్రికెట్ టీం, క్రికెట్ లవర్స్ కొవ్వలి జట్లు తలపడగా భక్తాంజనేయ టీం విజయం సాధించి మొదటి స్థానం కైవసం చేసుకుంది. క్రికెట్ లవర్స్ జట్టు రెండవ స్థానంలో నిలిచింది. విద్యార్థులు, యువకులు చెడు దారులు పట్టకుండా క్రికెట్, ఇతర క్రీడలు మానసిక ఆరోగ్యాన్ని పెంచుతాయని, యువత సన్మార్గంలో నడిచేందుకు ఈ ఆటలు దోహదపడతాయని నిర్వాహకులు తెలిపారు. విజేతగా నిలిచిన భక్తాంజనేయ టీంకు రూ.15 వేలు, రన్నరప్‌గా నిలిచిన క్రికెట్ లవర్స్ జట్టుకు రూ.10 వేలు నగదు బహుమతులు అందజేశారు. పాల్గొన్న మిగిలిన ఏడు క్రికెట్ జట్లకు ఒక్కో టీంకు రూ.2 వేలు చొప్పున నగదు అందించారు. కసుకుర్తి రామకృష్ణ, గద్ధే అమరేశ్వరరావు, వెధుళ్ల రాంబాబు, వల్లభనేని ప్రకాష్, గారపాటి మురళీకృష్ణ, కాటేపల్లి మురళీకృష్ణ ఆర్థిక సహకారంతో ఈ బహుమతులను అందజేసినట్లు నిర్వాహకులు తెలిపారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com