Logo
Date of Publish : 04 December 2021, 2:56 pm
Editor : Sake Naresh

దేవాలయాల మధ్య ఉన్న మద్యం దుకాణమును తొలగించాలని MRO గారికి వినతిపత్రం ఇచ్చిన కోవూరు నియోజకవర్గ జనసేన నాయకులు

    కోవూరు, (జనస్వరం) : నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం పరిధిలోని విడవలూరు మండలం రామతీర్థం గ్రామంలో వెలసి ఉన్న శ్రీ రామలింగేశ్వ స్వామి దేవస్థానం నుంచి భక్తులు సముద్ర స్నానానికి వెళ్లే మార్గంలో ప్రభుత్వ మద్యం దుకాణాన్ని ఏర్పాటు చేయడాన్ని జనసేనపార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఈరోజు విడవలూరు మండలం జనసేనపార్టీ అధ్యక్షులు శ్రీ కమతం శ్రీనాధ్ యాదవ్ గారి ఆధ్వర్యంలో వెంటనే మద్యం దుకాణం తొలగించాలని డిమాండ్ చెయ్యడం జరిగింది. అనంతరం ఈ విషయం మీద విడవలూరు మండల తహశీల్దార్ గారికి మద్యం దుకాణం తొలగించడానికి చర్యలు తీసుకోవాలని వినతిపత్రాన్ని ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో నెల్లూరు జిల్లా జనసేనపార్టీ ఉపాధ్యక్షులు బద్ధిపూడి సుధీర్, కోవూరు నియోజకవర్గం జనసేనపార్టీ నాయకులు నరాలశెట్టి మహేష్, విడవలూరు మండలం జనసేనపార్టీ నాయకులు శివ, వరప్రసాద్, శ్రీను, వావిళ్ళ హరికృష్ణ, గోవిందస్వామి మరియు జనసైనికులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com