Logo
Date of Publish : 19 August 2020, 12:12 pm
Editor : Sake Naresh

జలదిగ్బంధంలో ఉన్న మత్స్యకార గ్రామానికి పడవ ( నావ ) అందించిన కొత్తపేట జనసేన పార్టీ ఇంచార్జి బండారు శ్రీనివాస్

జలదిగ్బంధంలో ఉన్న మత్స్యకార గ్రామానికి పడవ ( నావ ) అందించిన కొత్తపేట జనసేన పార్టీ ఇంచార్జి బండారు శ్రీనివాస్

            ప్రజలకు ఆపద కలిగినప్పుడు వారికి సహకారం అందించేందుకు అధికారమే అక్కర్లేదని, సేవ చేసే మంచి మనసు ఉంటే చాలని నిరూపించుకున్న కొత్తపేట నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జి బండారు శ్రీనివాస్ గారు. గత మూడు రోజులుగా జలదిగ్బంధంలో ఉన్న ఆలమూరు మండలం నాలుగు వేల జనాభా గల బడుగువానిలంక గ్రామానికి సర్కారీ వారు కేవలం రెండు నావలు ఏర్పాటు చేసారు అయితే ఆ గ్రామంలోని చిన్న సన్నకారు రైతులతోపాటు బడుగు బలహీన వర్గాల ప్రజలు ఎక్కువగా జీవనం సాగించడంతో వారికి నిత్యావసర వస్తువులు ఏ రోజుకు ఆ రోజే కిలోమీటరున్నర దూరంలో సమీప గ్రామమైన చెముడులంక వెళ్లి సమకూర్చుకుంటారని, నిత్యావసర వస్తువులు తెచ్చుకోవాలంటే కేవలం రెండు నావలపైనే చెముడులంక వెళ్ల వలసి వస్తుందని వారు అన్నారు. ఈ విషయాన్ని కొత్తపేట నియోజకవర్గం జనసేన అధ్యక్షుడు బండారు శ్రీను దృష్టికి తీసుకుని వెళ్లడంతో తక్షణం స్పందించిన ఆయన మరో మరబోటు ఏర్పాటు చేసి ప్రజలకు అవసరాలు తగ్గట్లుగా ఉచితంగా రవాణా సౌకర్యం కల్పించాలని ఆదేశించినట్లు జన సైనికులు తెలిపారు. కష్టకాలంలో బండారు చేసిన సేవకు బడుగువానిలంక గ్రామ ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.  ఈ కార్యక్రమంలో జనసైనికులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. 


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com