Logo
Date of Publish : 28 February 2022, 5:03 pm
Editor : Sake Naresh

జనసైనికులకు ఉచితంగా భీమ్లా నాయక్ షో చూపించిన కొత్తపేట ఇంచార్జ్ బండారు శ్రీనివాస్

           కొత్తపేట ( జనస్వరం ) : నియోజకవర్గంలోని, కొత్తపేట టౌన్ నందు సత్య చంద్ర థియేటర్ ప్రాంగణంలో కొత్తపేట నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్చార్జి బండారు శ్రీనివాస్ ఆధ్వర్యంలో పవన్ కళ్యాణ్ నటించిన భీమ్లా నాయక్ చిత్రమునకు కేక్ కట్ చేసి విజయోత్సవము భారీగా నిర్వహించినారు. బండారు శ్రీనివాస్ జనసైనికులు, కార్యకర్తల కోసం ఉచితంగా తన సొంత ఖర్చులతో సత్య చంద్ర థియేటర్ నందు సినిమా చూపించారు. ఈ కార్యక్రమం ఫ్రీ షో కు భారీ స్థాయిలో తరలివచ్చిన జనసైనికులు, కార్యకర్తలు తోపాటు, ప్రేక్షకుల మధ్య జనసేనాని వర్ధిల్లాలి! అంటూ విజయోత్సవం ఆనందంతో జరుపుకున్నారు. జనసేనానికి శుభాకాంక్షలు అందజేశారు. మొన్న జరిగిన నరసాపురం మత్స్యకార అభ్యున్నతి సభలో జనసేనాని మాట్లాడుతూ, నన్ను ప్రజా సమస్యల మీద పోరాటం చేయకుండా, కుట్రతో నా కష్టార్జితాన్ని ఆర్ధిక మూలాలను దెబ్బ కొట్టడానికి, నా సినిమాను ఎవడన్నా అడ్డుకుంటే నేనే ఫ్రీ షో ఉచితంగా సినిమా వేసి చూపిస్తానని, చెప్పిన మాటను ఈరోజు కొత్తపేట నియోజకవర్గం ఇన్చార్జి బండారు శ్రీనివాస్ ఆచరించి, నిరూపించి చూపారు. ఈ షోకు సుమారు 3,000 మంది వరకు భారీ ఎత్తున జనసైనికులతో పాటు అన్ని వర్గాల వారు తరలివచ్చారు. అనంతరం భారీగా కేకులు కట్ చేసి ఫ్లెక్స్ కు పాలాభిషేకం, పూలతో అభిషేకం చేసి ఉన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి తాళ్ల డేవిడ్ రాజ్, జిల్లా కార్యదర్శలు బొక్క ఆదినారాయణ, దొంగ సుబ్బారావు, ఆలమూరు మండల జనసేన పార్టీ అధ్యక్షులు సూరపు రెడ్డి సత్య, ఆలమూరు జనసేన అధ్యక్షులు కట్టా రాజు, నాగిరెడ్డి మహేష్, కంఠం చెట్టి చంటి, చోడపునీడి ఉమా, మోకా శివ (7 up), కొత్తపేట మండల సీనియర్ జనసైనికులు తులా రాజు, ఐడియా మూర్తి, సలాది రమేష్, పప్పుల బాబ్జి, ఎలిశెట్టి శివ, గనిపూడి చిన్ని, అడపా ఆనంద్, ఆలమూరు మండల ప్రముఖ నాయకులు సలాది జయప్రకాష్ నారాయణ, బైరిశెట్టి రాంబాబు, కొత్తపేట టౌన్ జనసేన ప్రెస్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధి చంద్రశేఖర్, జనసైనికులు, కార్యకర్తలు, వీర మహిళలు, నాయకులు, యువకులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com