Logo
Date of Publish : 15 October 2020, 1:51 pm
Editor : Sake Naresh

ఆపదలో ఉన్న వారిని ఆదుకొని మానవత్వం చాటుకున్న కొత్తపేట ఇంచార్జ్ బండారు శ్రీనివాస్

ఆపదలో ఉన్న వారిని ఆదుకొని మానవత్వం చాటుకున్న కొత్తపేట ఇంచార్జ్ బండారు శ్రీనివాస్

              ఆపదలో ఉన్నవారిని మేమున్నామంటూ అభయమిచ్చి మానవత్వంతో ఆదుకున్న వారే నిజమైన భగవత్ స్వరూపులని కొత్తపేట నియోజకవర్గం జనసేన పార్టీ అధ్యక్షుడు బండారు శ్రీనివాస్ అన్నారు. తూర్పు గోదావరి జిల్లా కొత్తపేట నియోజకవర్గం ఆలమూరు మండలం మడికి శివారు చిలకలపాడు గ్రామంలో ప్రమాదవశాత్తు జరిగిన అగ్ని ప్రమాదంలో గృహంతో పాటు సర్వం కోల్పోయిన కొత్తపల్లి వెంకన్న, కుమ్మరపురుగు దుర్గమ్మ కుటుంబాలకు ఆయన గురువారం సంఘటన స్థలాన్ని పరిశీలించి ఒక్కొక్క కుటుంబానికి రూ. 5 వేలతో పాటుగా బియ్యంను అందజేశారు. అలాగే ఈయన కోరిక మేరకు ప్రవాస భారతీయులు (ఎన్ఆరై) రాయుడు వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో తన మిత్రబృందం మరో రూ.10 వేలను బండారు చేతుల మీదుగా బాధ్యత కుటుంబాలకు అందజేశారు. ఈ సందర్భంగా బండారు శ్రీను మాట్లాడుతూ ఆపదలో ఉన్న వారిని మానవత్వంతో ప్రతి ఒక్కరూ ఆదుకోవడం మానవులుగా ముఖ్య కర్తవ్యమని అన్నారు. ఈ కార్యక్రమంలో జన సైనికులు కొత్తపల్లి నగేష్, సూరపురెడ్డి సత్య, పడాల అమ్మిరాజు, తమన్నా భాస్కర్రావు, నాగిరెడ్డి మహేష్ ,పాలూరి అర్జున్ కొత్తపల్లి, నాగు, మలయాళ సురేషు, మద్దిరెడ్డి సందీప్, పాలూరి సుబ్బరాజు, పాలూరు జగదీష్, పలువురు జన సైనికులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com