Logo
Date of Publish : 15 January 2021, 2:22 pm
Editor : Sake Naresh

జనసేన పార్టీలోకి కొత్తపేట నియోజకవర్గం వానపల్లి గ్రామ టీడీపీ ప్రముఖులు భారీగా చేరికలు

                             కొత్తపేట నియోజకవర్గంలో, కొత్తపేట మండలం, వానపల్లి గ్రామానికి చెందిన పలువురు తెలుగుదేశం ప్రముఖులు, జనసేనాని పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలు నచ్చి, జనసేన పార్టీ వైపు ఆకర్షితులై, జనసేన పార్టీలోకి జనసేన నాయకులు బండారు శ్రీనివాస్ సమక్షంలో భారీగా చేరారు. కొత్తపేట నియోజకవర్గంలో అన్ని గ్రామాల్లో జనసేన పార్టీ బలోపేతం దిశగా అడుగులు వేస్తున్నదని, జనసేన పార్టీ నియోజకవర్గ ఇంచార్జ్ బండారు శ్రీనివాస్ ఎంతో సంతోషం వ్యక్తం చేస్తూ, ప్రజల్లో మార్పు వచ్చిందని రానున్న రోజుల్లో ఇంకా భారీగా చేరికలు ఉంటాయని తెలియజేసారు. అన్ని పార్టీల నుంచి జనసేన పార్టీలోకి వలసలు పెరుగుతాయని, జనసేనపార్టీ సిద్ధాంతాలు నచ్చి మెచ్చి జనసేన వైపు ప్రజలు ఆకర్షితులు అవుతున్నారని అని అన్నారు.  ప్రస్తుత రాజకీయాల్లో అవినీతి లేని, మచ్చలేని నాయకుడు ఒక జనసేనాని పవన్ కళ్యాణ్ మాత్రమేనని అన్నారు. ఈ విషయాన్ని ప్రజలు గ్రహించారని, మన రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే, ఒక్క పవన్ కళ్యాణ్ కు మాత్రమే సాధ్యమని, ఆంధ్ర రాష్ట్రం ప్రస్తుతం అప్పుల రాష్ట్రంగా మారిపోతుందని అన్నారు. జనసేన పార్టీలో చేరిన నాయకులు ఎంతో ఆవేదన వ్యక్తం చేస్తూ, పలువురు తెలుగుదేశం నాయకులు జనసేన పార్టీ వైపు ఆకర్షితులై బండారు శ్రీనివాస్ సమక్షంలో ఈ రోజు భారీగా చేరరన్నారు. రానున్న రోజుల్లో జనసేన పార్టీ, బీజేపీతో కలిసి తప్పకుండా అధికారం చేపడుతుందని, ఈ రాష్ట్రానికి పవన్ కళ్యాణ్ నాయకత్వం ఎంతో అవసరమని, అలాగే ప్రధానమంత్రి నరేంద్రమోడీ నాయకత్వం ఈ దేశానికి మరింత అవసరమని అన్నారు. ఈ సందర్భంగా జనసేన పార్టీలోకి చేరిన,వానపల్లి గ్రామ టిడిపి సీనియర్ నాయకులు సిద్దాబత్తుల సత్యనారాయణ, తన అనుచరులతో కలిసి జనసేన పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో సిద్దా బత్తుల మాణిక్యాలరావు, గొల్లపల్లి రామకృష్ణ, బోక్కే సత్యనారాయణ, గొల్లపల్లి ఆనంద్ కుమార్, బళ్ళ వెర్రియ్య, సాదే గణేష్, సాయిబాబు, ఇళ్ల కృష్ణార్జున రావు, బండారు నాగేశ్వరరావు, బండారు సత్తిబాబు, జనసేన పార్టీలోకి చేరినారు. వీరితో పాటు గ్రామ జనసైనికులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com