
కొత్తవలస, (జనస్వరం) : కొత్తవలస జంక్షన్ లో ప్రపంచ మేధావి పేద బడుగు బలహీన వర్గాల ప్రజల ఆశా జ్యోతి బీమారావు రాం జి అంబేద్కర్ కి పూలమాలలు వేసి ఆయన ఆశీస్సులతో “యువశక్తి” మన యువత – మన భవిత భారీ బహిరంగ సభ పోస్టర్లు ఆవిష్కరణ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో కొత్తవలస మండల జనసేనపార్టీ అధ్యక్షులు నక్కరాజు సతీష్ మాట్లాడుతూ యువత ఉపాధి, ఉద్యోగ రంగాలపై ప్రభుత్వాలు చిన్న చూపు కారణంగా యువత భవిష్యత్ నిర్వీర్యం అయిపోయిందని యువత భవిష్యత్ కు అండగా జనవరి 12 తేదీన శ్రీకాకుళం జిల్లా రణస్థలం వేదికగా జనసేనపార్టీ అధినేత (జనసేనాని) పవన్ కళ్యాణ్ అధ్యక్షతన “యువశక్తి” భారీ బహిరంగ సభలోలో పాల్గొవాలి అని యువతకు పిలుపు ఇస్తూ, “యువశక్తి” భారీ బహిరంగ సభ పోస్టర్లు ఆటోలకు, బస్ లకు, ఇండ్లకు అంటించడం జరిగింది. అలాగే కొత్తవలస జనసేన నాయకులు గాలి అప్పారావు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం ఒకటో తేదీకి జాబ్ క్యాలండర్ విడుదల చేస్తామని చెప్పిన ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన మాట తప్పి, మడం తిప్పి, మొద్దునిద్దురలో ఉన్న వైసీపీ ప్రభుత్వంను జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ జనవరి12 వ తేదీన నిద్దుర లేపబోతున్నారని, దీనికి ఆయన వెంట మన యువత అంత తోడుగా వెళ్లాలని తెలియజేసారు. జిల్లా ప్రచార కమిటి మెంబర్ మల్లువలస శ్రీను, శృంగవరపుకోట నియోజకవర్గ నాయకులు పబ్లిసిటీ కమిటీ మెంబర్ వబ్బిన సత్యన్నారాయణ (సత్తిబాబు)మాట్లాడుతూ ఈ భారీ బహిరంగ సభకు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని మీడియా ముఖంగా మాట్లాడారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు మల్ల రాజు, రాంబాబు, తోట శ్రీను, మెగా శ్రీను, బొబ్బరి సురేష్, పెంటాజీ, షేక్ ఫిరోజ్, రుద్ర నాయుడు, ఇర్రస్వామి తదితరులు పాల్గొన్నారు.