కృష్ణా జిల్లా పెదాయాదర పంచాయతీలో గుర్రం కోటేశ్వర రావు అనే సోదరుడు కిడ్నీ వ్యాధితో బాధపడుతూ తనకు కిడ్నీ పాడైందని స్థానిక జనసేన నాయకుల దృష్టికి తీసుకెళ్లారు. మచిలీపట్టణం జనసేన ఇంచార్జి బండి రామకృష్ణ గారు, మండల అధ్యక్షులు మరియు పెదాయాదర సర్పంచ్ గల్లా తిమోతి గారు, ముళ్ళపూడి సుబ్బారావు గారు మరియు ఇతర జనసైనికులు, హరిజనవాడ పెద్దలు చెవిరియ్య గారు , సాలి రామకృష్ణ గారు ఇతరులు సోదరులు స్పందించి వారికి రూ. 20,000 ఆర్థిక సాయం అందించడం జరిగింది. కరోనా కష్టకాలంలో పెద్దలు, ఇతర ఫౌండషన్స్ వారు ఈ కుటుంబానికి ఆర్థిక సాయం చేసి తమ దాతృత్వాన్ని చాటుకోవాలని, నిరుపేద కుటుంబానికి అండగా నిలవాలని కోరారు. ఈ కార్యక్రమాల్లో అడుసుమిల్లి నాంచారయ్య గారు, ముళ్ళపూడి నరేంద్ర గారు, ఖాకీమని రమేష్ గారు తదితరులు పాల్గొన్నారు.