నెల్లూరు ( జనస్వరం ) : నెల్లూరు నగరంలోని జనసేన జిల్లా కార్యాలయంకు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, టిడిపి నేత కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి తదితరులు శుక్రవారం చేరుకున్నారు. ఈ సందర్భంగా వారు జనసేన జిల్లా నేతలతో ఆత్మీయంగా భేటీ అయ్యారు. జనసేన కార్యాలయంకు కోటంరెడ్డి సోదరులు చేరుకోగానే జనసేన జిల్లా చెన్నారెడ్డి మను క్రాంత్ రెడ్డి, నెల్లూరు నగర అధ్యక్షులు దుగ్గి శెట్టి సుజయ్ బాబు తదితరులు ఆత్మీయ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా జనసేన నేతలతో ఆత్మీయ సమావేశం నిర్వహించి దిశానిర్దేశం చేశారు. టిడిపి- జనసేన నేతలు, కార్యకర్తలు మరింత కలిసి కట్టుగా పనిచేయాలని సూచించారు. ఉమ్మడి నెల్లూరు జిల్లాలో పదికి పది స్థానాల్లో టిడిపి - జనసేన కూటమి విజయం సాధించే విధంగా ప్రతి ఒక్కరు కష్టపడి పని చేయాలన్నారు. జనసేన జిల్లా అధ్యక్షుడు చెన్నారెడ్డి మనుక్రాంత్ రెడ్డి మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా తమ వంతు సహకారం ఉంటుందన్నారు. నెల్లూరు రూరల్ లో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సమర్ధవంతంగా పనిచేస్తూ ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉంటున్నారన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నేతలు కొట్టే వెంకటేశ్వర్లు, షేక్ ఆలియా, కరీం, ఉదయ్, పవన్ యాదవ్ , జగదీష్ రెడ్డి , భీమాయ , శ్రీనివాసులు , షకీర్ , షానవాజ్ , నాగరాజు టిడిపి నేతలు రాజా నాయుడు, పెంచలనాయుడు, ఇందుపూరు శ్రీనివాసరెడ్డి, జలదంకి సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com