
శ్రీకాకుళం, (జనస్వరం) : కోటబొమ్మాళి మండలం కురుడు, క్రిస్టిపురం, కన్నెవలస, పంచాయతీ లో వంశధార ఎడమ కాలువపై వుండే తారకరామా ఎత్తి పోతల సంఘము ద్వారా 1600 ఎకరాల్లో ఖరీఫ్ సాగుచేసే 2000 మంది రైతులకు అండగా జనసేన పార్టీ కోటబొమ్మాళి మండలం నాయకులు MPTC అభ్యర్థి పల్లి కోటేశ్వరరావు, చిన్నాల మాధవ రావు గారు కలసి శ్రీకాకుళం కలెక్టర్ గారికి, జాయింట్ కలెక్టర్ సుమిత్ గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. వారు మాట్లాడుతూ వంశధార ఎడమ కాలువు పైన సుమురు 12 లిఫ్ట్ ఇరిగేషన్ ఉన్నాయి. ఈ ఆయకట్టు క్రింద సుమూరు 20,000 ఎకరాల్లో ఖరీఫ్ సీజన్లో వరి పండించడం జరుగుతుంది. ఇప్పటి వరకు నీరు విడుదల చేయక పోవడంతో పూర్తిగా వరి, ఆకు నారు మడి పూర్తిగా ఎండిపోయి, చెదలు పట్టి నీరు లేక యెందుకు పనికి రాకుండా పోతుంది. అధికారులు నిర్లక్ష్యం వల్ల పిల్ల కాలువులు ద్వారా వృధా గా సముద్రంలోకి నీరు కలిసిపోతుంది అని చెప్పడం జరిగింది. కలెక్టర్ గారు స్పందించి 2 రోజుల్లో పరిష్కరిస్తానన్నారు. స్పందించని పక్షంలో జనసేన పార్టీ తరపున రైతులుకోసం పోరాడుతాము అని అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు , జనసైనికులు మరియు ముడూ పంచాయతీ రైతులు తదితురులు పాల్గొన్నారు.