Logo
Date of Publish : 27 June 2023, 5:20 pm
Editor : Sake Naresh

ఎమ్మెల్యే ప్రోద్బలంతో అక్రమకేసు పెట్టి మానసికంగా హింసిస్తున్నారని వినుతా కోట ఆవేదన

     శ్రీకాళహస్తి ( జనస్వరం ) : నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ వినుతా కోటా గారి భర్త, జనసేన పార్టీ నాయకులు కోటా చంద్రబాబు గారికి బెయిల్ రానివ్వకుండా చేయడానికి స్థానిక MLA ప్రోద్బలంతో పోలీస్ కస్టడీ పేరుతో  శ్రీకాళహస్తి సబ్ జైలు నుండి ఏర్పేడు పోలీస్ స్టేషన్కు తీసుకొని వెళ్లడం జరిగింది. వందల మంది జనసైనికులు శ్రీకాళహస్తి సబ్ జైలు నుండి పోలీస్ వాహనాన్ని అనుసరిస్తూ ఏర్పేడు పోలీస్ స్టేషన్ వరకు వెళ్లడం జరిగింది. కస్టడీ అనంతరం ఏర్పేడు పోలీస్ స్టేషన్ నుండి శ్రీకాళహస్తి కోర్టు జడ్జి ముందు హాజరు పరిచి తిరిగి శ్రీకాళహస్తి సబ్ జైల్ నందు కోటా చంద్రబాబు గారిని హాజరుపరచుట జరిగింది. బెయిల్ కు కాలయాపన కోసమే స్థానిక ఎమ్మెల్యే ప్రోద్బలంతో అక్రమ కేసు పెట్టి మానసికంగా హింసించబడము కొరకు ఈ విధమైన చర్యలు పోలీసులు చేస్తున్నారని నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ వినుత కోటా ఆరోపించారు. ఈ కార్యక్రమంలో లీగల్ సెల్ విభాగం  లాయర్లు లీగల్ సెల్ చిత్తూరు జిల్లా అధ్యక్షుడు అమర్ నారాయణ, చిత్తూరు జిల్లా ఉపాధ్యక్షురాలు కంచి శ్యామల, లీగల్ సెల్ టీం మంజునాథ, శ్రీహరి, జయచంద్ర, విజయభాస్కర్ పోలీస్ స్టేషన్ నందు కస్టడీ ముగిసే వరకు  కోటా చంద్రబాబుకు అండగా నిలబడ్డారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com