నూతన రాజకీయ పార్టీ ఆవిష్కరణ చేస్తున్న ఆర్ ఎం పి కొండిశెట్టి సురేష్
విజయవాడ.డిసెంబర్ 06.( జనస్వరం)
భారతదేశ చరిత్రలో ఒక గ్రామీణ వైద్యుడు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ పార్టీ ఆవిష్కరణ కార్యక్రమం 14 వ తేదీ డిసెంబర్ ఆదివారం ఉదయం 9.34 గంటలకు రాజకీయ పార్టీని ఆవిష్కరించటం ఒకే రోజు రెండు తెలుగురాష్ట్రాల్లో పార్టీని ఆవిష్కరించటం నూతన చరిత్ర. ప్రజలతో నిత్యం అందుబాటులో ఉండి ప్రధమచికిత్స చేస్తూ ప్రజలతో కుటుంబ సభ్యుని వలె గ్రామీణ వైద్యుడికి ప్రజల నాడీ తెలుసు. కుటుంబ పరిస్థితులు వారి సాధక బాధలు తెలుసు. పేద మధ్య తరగతి ధనికుల స్థితిగతులు పరిస్థితులు ప్రజల జీవననాడీ జీవనవిధానం వారి ప్రస్తుత ఇబ్బందులు అన్ని విషయాలలో గ్రామీణ వైద్యులకు ఒక అవగాహన ఉంటుంది.స్వాతంత్రం వచ్చినప్పటి నుండి నేటివరకు ఒక గ్రామీణ వైద్యుడు రాజకీయ పార్టీని స్థాపించడం రెండు తెలుగు రాష్ట్రాలలో ఒకేసారి పార్టీని ఆవిష్కరించడం నూతన చరిత్ర.కొందరు చరిత్రలు తిరగ రాయడానికి ఈ భూమి మీదకి వస్తారు. ఒకప్పుడు గుడివాడ నుండి వెండి తెరపై ఒక వెలుగు వెలిగిన మహానుభావులు రాజకీయ పార్టీలు స్థాపించి చరిత్రలు సృష్టించిన మహానుభావులు ఎందరో ఉన్నారు. అదే కోవకు చెందిన కొండిశెట్టి సురేష్ బాబు గుడివాడలో పుట్టి పెరిగి జీవనం కోసం విజయవాడలో ఉంటూ అనేక వ్యవస్థలలో పని చేయుచూ, నేడు నూతన రాజకీయ పార్టీని రెండు తెలుగు రాష్ట్రాల పార్టీ బ్రోచర్ ఆవిష్కరణ చేయుచున్న గౌరవ డాక్టరేట్ అవార్డు గ్రహీత, ఉత్తమ జర్నలిస్ట్ అవార్డు గ్రహీత, పబ్లిక్ సోషల్ సర్వీస్ హీరో అవార్డు గ్రహీత రాజకీయ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు డా.కొండిశెట్టి సురేష్ బాబు విజయవాడ గాంధీ నగర్ హనుమంతరాయ గ్రంథాలయం నందు ఘనంగా అభిమానుల మధ్య పెద్దల ఆశీస్సులతో నూతన రాజకీయ పార్టీ ఆవిష్కరణ చేయుచున్నారు.స్వాతంత్రం వచ్చిన నాటి నుండి నేటి వరకు ఎన్నిక సమయంలో రాజకీయ పార్టీలు గ్రామీణ వైద్యులకు హామీలు నాయకులు ఇవ్వడం, నాయకులు హామీలు ఇచ్చి అధికారం వచ్చిన తర్వాత కనీసం అపాయింట్మెంట్ కూడా ఇవ్వకపోవటం, హామీలు నేర వేర్చక పోవటం తరాలుగా జరుగుతుంది.రెండు తెలుగు రాష్ట్రాలనుండి కొండిశెట్టి సురేష్ బాబు అభిమానులు శ్రేయోభిలాషులు,మీడియా మిత్రులు, గ్రామీణ వైద్యులు, ప్రజా నాయకులు, రాజకీయ విశ్లేషకులు, ప్రజలు ఈ కార్యక్రమానికి విచ్చేయుచున్నారని నూతన రాజకీయ పార్టీ వ్యవస్థాపకులు అధ్యక్షులు గౌరవ డాక్టరేట్ అవార్డు గ్రహీత డాక్టర్ కొండి శెట్టి సురేష్ బాబు 9885395466 విజయవాడ తన కార్యాలయం నందు ఒక ప్రకటనలో తెలియజేశారు.