తెలంగాణ, (జనస్వరం) : తెలంగాణ రాష్ట్ర ఇంచార్జి నేమురి శంకర్ గౌడ్, ఉమ్మడి వరంగల్ ఇంచార్జి సుమన్ ఆకుల ఆదేశాల మేరకు ఉమ్మడి వరంగల్ జిల్లా జనసేన పార్టీ ఆధ్వర్యంలో కొండగట్టు యాత్ర పోస్టర్ ఆవిష్కరణ చేయడం జరిగింది. జనవరి 24న జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కొండగట్టు యాత్రకు సంబందించిన పోస్టర్ ఆవిష్కరణ గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్ లో నిర్వహించడం జరిగింది. ఈ సందర్బంగా ఉమ్మడి జిల్లా నాయకులు మాజీ గ్రేటర్ వరంగల్ అధ్యక్షులు శ్రీ బైరి వంశీ కృష్ణ గారి చేతులమీదుగా చలో కొండగట్టు పోస్టర్ ఆవిష్కరించారు. అనంతరం అయినా మాట్లాడుతూ, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని కొండగట్టు అంజన్నను దర్శించి ఆలయ సన్నిధిలో వారహి వాహనానికి పూజలు జరిపించాలని పవన్ కళ్యాణ్ నిర్ణయించారు. అనంతరం తెలంగాణకు సంబందించిన ముఖ్య నాయకులతో సమావేశం నిర్వహించి రాబోయే రోజుల్లో తెలంగాణాలో పార్టీ అనుసరించే వ్యూహం, చేపట్టబోయే కార్యక్రమాల గురించి చర్చించి దిశ నిర్దేశం చేస్తారు. కావున ఉమ్మడి జిల్లాలో ఉన్న 12 నియోజకవర్గల నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి పవన్ కళ్యాణ్ యాత్రను విజయవంతం చేయాలనీ కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు తాళ్లపెల్లి క్రాంతికుమార్, వెళ్తూరి నగేష్, శేషాద్రి సందీప్, జన్ను ప్రవీణ్, సాయికిరణ్, రమేష్, అరుణ్, సాయి కృష్ణ తదితరులు పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com