
గాజువాక ( జనస్వరం ) : నియోజకవర్గం 86 వార్డు కార్యవర్గ సభ్యులు, ముఖ్య నాయుకులు, జనసైనికులు, వీర మహిళలతో కుర్మాన్నపాలెంలో వార్డు అధ్యక్షులు కాద శ్రీను ఆధ్వర్యంలో సమావేశం జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైన జనసేన పార్టీ PAC సభ్యులు, గాజువాక నియోజకవర్గం ఇంచార్జి కోన తాతారావు కొత్తగా నియమితులైన 86వ వార్డు కార్యవర్గాన్ని అభినందించారు. రాబోయే ఎన్నికల్లో జనసేన పార్టీకి, ప్రజలకు మధ్య వారధిలా పనిచేయాలని, బూత్ కమిటీలు, గ్రామ స్థాయి కమిటీలు వెంటనే పూర్తి చేసి ఎన్నికలకు సిద్ధం కావాలని సూచించారు. ఈ సమావేశంలో వార్డు ప్రధాన కార్యదర్శి గంట్ల త్రినాథ్, ఉపాధ్యక్షులు కర్రి రాజు, సూరి అప్పారావు, మహిళా నాయకురాలు కరణం కళావతి, కార్యదర్శి విజయ్, వెంకట్రావు, జ్ఞానేష్, గణేష్, సహాయ కార్యదర్శులు, జనసైనికులు, వీరామహిళలు పాల్గొన్నారు.