నిబద్ధతకు మారుపేరు కోమలపాటి సుధాకర్ బాబు

– డిప్యూటీ మేయర్ కోగటం విజయ భాస్కర్ రెడ్డి
     అనంతపురము, ఫిబ్రవరి 2 : వృత్తి నిబద్ధత, సామాజిక స్పృహ కలిగిన వ్యక్తి ఏ పి ఎస్ పి డి సి ఎల్ ఈ ఈ కోమలపాటి సుధాకర్ బాబు అని డిప్యూటీ మేయర్ కోగటం భాస్కర్ రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం పిటిసి స్టేడియం వాకర్స్ అసోసియేషన్ పిటీసి స్టేడియంలో వాకర్స్ సభ్యులు, ఆత్మీయ మిత్రులు ఉద్యోగ విరమణ సందర్భంగా ఘనంగా సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎస్కేయూ మాజీ రిజిస్టర్ సుధాకర్ బాబు అధ్యక్షత వహించగా ముఖ్య అతిధిగా డిప్యూటీ మేయర్ కోగటం విజయభాస్కర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రశేఖరరెడ్డి ముఖ్య వక్తగా ప్రసంగించారు. సభ్యులు మాజీ ఏపీపీ నాగలింగం, ఆర్ ఐ ఓ రమణ, ఏపీజీబీ మేనేజర్ అశ్వార్తు, మాజీ టౌన్ బ్యాంక్ మేనేజర్ లోకనాథ్, రాయల్ మురళి మోహన్, వైస్సార్ నాయకులు రిలాక్స్ నాగరాజు, రాజు, కృష్ణమోహన్, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు పోట్ల రవి, సీనియర్ కాంట్రాక్టర్ కే వెంకట సాయికుమార్, ఇందిరా ప్రియదర్శిని హోటల్ ధనుంజయ బాబు తదితరులు సుధాకర్ బాబు విధి నిర్వహణలో తన బాధ్యతలు నిర్వహిస్తూ సామాజిక సేవ భాగంలో పి టి సి స్టేడియం నిర్వహణలో సభ్యులకు వాకింగ్ కి సౌకర్యలు కల్పించడంలో మరియు ఆఫీసర్స్ క్లబ్ నందు గత ఆరు సంవత్సరాలుగా ప్రతిరోజు అన్న దాన కార్యక్రమాన్ని నిర్వహించేవారు అన్నారు. పదవి విరమణ అనేది వయసుకు సంబంధించిందే కానీ మనసుకు కాదని తను మరింత సేవా కార్యక్రమాల్లో పాలు పంచుకుంటూ అందరి వాడిలా ఉండాలని కోరుకుంటున్నామన్నారు. ఈ సమావేశంలో వాకర్స్ అసోసియేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way