Logo
Date of Publish : 08 August 2022, 2:09 pm
Editor : Sake Naresh

కొలునుకొండ – వడ్డేశ్వరం వంతెన రోడ్డును వెంటనే మరమ్మతులు చేపట్టాలి : తాడేపల్లి జనసేన నాయకులు

      తాడేపల్లి, (జనస్వరం) : జనసేన పార్టీ మంగళగిరి నియోజకవర్గ ఇంఛార్జ్ చిల్లపల్లి శ్రీనివాసరావు ఆదేశాల మేరకు తాడేపల్లి మండల అధ్యక్షులు సామల నాగేశ్వరావు ఆధ్వర్యంలో రోడ్డును వెంటనే మరమ్మతులు చేయాలని డిమాండ్ చేస్తూ జనసేన పార్టీ తరుపున నిరసన తెలియజేయడం జరిగింది. తదనంతరం జనసేన పార్టీ తాడేపల్లి మండలం అధ్యక్షులు సామల నాగేశ్వరరావు మీడియాతో మాట్లాడుతూ గత సంవత్సరం డిసెంబర్ 12 వ తేదీన రాష్ట్రంలో రోడ్ల దుస్థితిని నిరసిస్తూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేపట్టిన కార్యక్రమంలో స్వయంగా పవన్ కళ్యాణ్ ఈ రోడ్డుకి శ్రమదానం చేశారు. అయినప్పటికీ ఈ ప్రభుత్వం పట్టించుకోలేదు. మళ్ళీ మా అధినేత పవన్ కళ్యాణ్ డిజిటల్ క్యాంపెనింగ్ మొదలు పెట్టారని తెలిసి హడావిడిగా అప్పటికి అప్పుడు కంటి తుడుపుగా రోడ్డు వేశారు. రెండు నెలల కాల వ్యవధిలోనే ఈ రోడ్డు కుంగిపోయింది. అంటే ప్రభుత్వం ఇటువంటి నాసిరకం రోడ్లతో ప్రభుత్వం ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతుంది. కుంగిపోయిన రోడ్డుకు వెంటనే మరమ్మతులు చేయాలని జనసేన పార్టీ తరుపున డిమాండ్ చేస్తున్నామని అలా చేయని పక్షంలో ఆందోళన ఉదృతం చేస్తాము అని తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ తాడేపల్లి మండల అధ్యక్షులు సామల నాగేశ్వరరావు, జనసేన పార్టీ గుంటూరు జిల్లా సంయుక్త కార్యదర్శి బడే కోమలి, మంగళగిరి నియోజకవర్గ సమన్వయ కమిటీ సభ్యులు దాసరి శివ నాగేంద్రం, తాడేపల్లి నాయకులు శెట్టి రామకృష్ణ, తిరుమలశెట్టి శ్రీధర్, ఇప్పటం గ్రామ నాయకులు తిరుమల శెట్టి నరసింహారావు, తాడేపల్లి మండలం ఐటీ విభాగం సభ్యులు శంకర్ శెట్టి కృష్ణమోహన్, జనసైనికులు షేక్ షఫీ, నీలాద్రి వంశీ, సేలం శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com