Logo
Date of Publish : 23 July 2022, 3:59 pm
Editor : Sake Naresh

కొల్లాపూర్ నియోజకవర్గ జనసైనికుల ఆత్మీయ సమావేశం

           కొల్లాపూర్ ( జనస్వరం ) : కొల్లాపూర్ నియోజకవర్గంలో క్రియాశీలక సభ్యత్వం నమోదు చేసుకున్న క్రియాశీలక సభ్యులకు కిట్ల పంపిణీ కార్యక్రమం చేశారు. జనసేన పార్టీ ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా యూత్ వింగ్ అధ్యక్షులు కొల్లాపూర్ నియోజకవర్గ నాయకులు బైరపోగు సాంబశివుడు గారి ఆధ్వర్యంలో పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రియాశీలక సభ్యత్వం నమోదు చేసుకున్న ప్రతి ఒక్క సభ్యునికి సభ్యత్వాలు నమోదు చేయించిన కో-ఆర్డినేటర్స్ కి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసారు. అదే విధంగా యువతను కేవలం రాజకీయ నాయకుల లబ్ది కోసం మాత్రమే వాడుకుంటున్నారు. యువతకు వారి వారి ఆశయం, లక్ష్యాలను నెరవేర్చే దిశగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలం అయిపోయిందన్నారు. యువతకు పెద్ద పీట వేస్తుంది తెలంగాణ రాష్ట్రంలో కేవలం ఒక్క జనసేన పార్టీ మాత్రమే అని అన్నారు. యువత ఇకనైనా మేలుకొని, స్వార్థ రాజకీయాలను ఎండగట్టాలి. పవన్ కళ్యాణ్ గారి ఆశయాలను, సిద్ధాంతాలను, యువత పట్ల జనసేన బలంగా నిలబడుతుందని దిశనిర్ధేశం చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా యూత్ వింగ్ ఆర్గనైజింగ్ సెక్రటరీ సూర్య, నాగర్ కర్నూల్ పార్లమెంటరీ ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు తల్లారి సాంబశివుడు, నాగర్ కర్నూల్ పార్లమెంటరీ వర్కింగ్ కమిటీ సభ్యులు తల్లారి మల్లేష్, కోడెర్ మండల నాయకులు పోలోజు రఘు, జనసైనికులు ఫారూఖ్, సుల్తాన్, రవితేజ, నాగరాజు, అంజి, శేఖర్, మాసుం,వడ్డేమాన్ లక్ష్మణ్, బాలాజీ, అంజి, సైదులు, అరవింద్, వినోద్ తదితరులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com