Logo
Date of Publish : 19 January 2023, 3:58 pm
Editor : Sake Naresh

కొల్లాపూర్ నియోజకవర్గ బరిలో ఉండబోతుంది : జనసేన పార్టీ కో-ఆర్డినేటర్ భైరపోగు సాంబశివుడు

         కొల్లాపూర్  ( జనస్వరం ) : నియోజక వర్గ ప్రజల సమస్యల పైన దృష్టి సారించి గడపగడపకి జనసేన పార్టీ సిద్ధాంతాలను, పవన్ కళ్యాణ్ గారి ఆలోచన విధానాన్ని ప్రతి గడపగడపకి తీసుకెళ్లే విధంగా జనసేన పార్టీ కార్యకర్తలు పని చేయాలని భైరపోగు సాంబశివుడు గారు పిలుపునిచ్చారు. జనసేన పార్టీ తరఫున ప్రజల పక్షాన పోరాడి సమస్యలు పరిష్కారం అయ్యే దిశగా ప్రతి ఒక్క అభిమాని జనసైనికుడు ప్రతి గడపకి తిరగాలని ఆ దిశగా పనిచేస్తూ ముందుకు సాగే విధంగా కార్యక్రమం రూపొందించుకొని కొల్లాపూర్ నియోజకవర్గంలో రాబోయే రోజుల్లో జనసేన జెండా ఎగిరే విధంగా ముందుకెళ్లాలని కోరారు. ఈ ప్రభుత్వాలు చేస్తున్న అక్రమాలను అన్యాయాలను దాడులను వ్యతిరేకిస్తూ ప్రజలను ప్రభావితం చేస్తూ మహనీయులు మార్గాన్ని చూపుతూ అధికార దిశగా అడుగులు వేయాలని ప్రతి ఒక్కరిని కోరుతున్నానన్నారు. ఈ సందర్భంలో ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో కొల్లాపూర్ నియోజక వర్గ ప్రజలకు జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారి అవసరమెంతైనా ఉంది అని ప్రజలకి పార్టీని దగ్గర చేయడమే మన అంతిమ లక్ష్యంగా పనిచేయాలని ఆయన కార్యకర్తలకు పిలుపునిచ్చారు. కొల్లాపూర్ నియోజక వర్గమే కాకుండా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జనసేన పార్టీ బలమైన శక్తిగా బలమైన ప్రభావం చూపబోతుందని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు. పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీని స్థాపించింది కేవలం రాజకీయంగా వెనుకబాటుకు గురైన సమాజానికి ప్రజలను ఏకం చేస్తూ రాజకీయాల వైపు రాజ్యాధికారం దిశగా నడిపించడం కోసమే ఆయన జనసేన పార్టీని స్థాపించి ఆ దిశగా అహర్నిశలు కష్టపడుతూ రెండు తెలుగు రాష్ట్రాల్లో దూసుకుపోతున్నారు. వచ్చే ఎన్నికలకు కొల్లాపూర్ నియోజకవర్గంలో ఉన్న ప్రతి కార్యకర్త ఎన్నికల సమరానికి సిద్ధంగా ఉండాలని ఈ సందర్భంగా కొల్లాపూర్ నియోజకవర్గం కోఆర్డినేటర్  భైరపోగు సాంబశివుడు గారు కోరారు. ఈ కార్యక్రమంలో కొల్లాపూర్ మండల నాయకులు తల్లారి మల్లేష్, బత్తిని బాలు, రాఘవేందర్, సుల్తాన్ గిరి ప్రసాద్, విజయ్ కుమార్, ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com