కనిగిరి ( జనస్వరం ) : జనసేన పార్టీ కృష్ణా గుంటూరు,ప్రకాశం,నెల్లూరు రీజినల్ కోఆర్డినేటర్ కోలా విజయలక్ష్మి గారిని మర్యాదపూర్వకంగా కలిసిన కనిగిరి జనసైనికులు. ఈ సందర్భంగా కోల విజయలక్ష్మి గారు మాట్లాడుతూ కనిగిరి నియోజకవర్గం జనసేన పార్టీ అభివృద్ధిపై నియోజకవర్గ సమస్యలపై, పార్టీ బలోపేతం గురించి జనసేన పార్టీ నాయకులను, కార్యకర్తలను వివరాలను అడిగి తెలుసుకున్నారు. జనసేన పార్టీ తరఫున మా సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని ఆమె చెప్పారు ఈ కార్యక్రమంలో కనిగిరి మండల అధ్యక్షుడు ఇండ్ల రమేష్, కనిగిరి టౌన్ అధ్యక్షుడు అంజి నాయుడు, జనసేన నాయకులు రాజేష్, సాయి కిషోర్,చరణ్,రవి అజయ్,శ్రీకాంత్ చిన్నా జనసేన కార్యకర్తలు పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com