Logo
Date of Publish : 10 November 2020, 4:41 pm
Editor : Sake Naresh

మానవత్వంతో నిరుపేద వృద్ధురాలకు ఇంటిని నిర్మిస్తున్న కోడూరు జనసైనికులు

మానవత్వంతో నిరుపేద వృద్ధురాలకు ఇంటిని నిర్మిస్తున్న కోడూరు జనసైనికులు

               పాశం సీతమ్మ అనే  ఒక నిరుపేద వృద్ధురాలకు అవనిగడ్డ నియోజకవర్గం కోడూరు జనసైనికులు ఇంటి నిర్మాణం చేయడానికి తలపెట్టారు. సామాజిక మాధ్యమాల్లో వృద్ధురాలి పరిస్థితిని తెలుసుకున్న స్థానిక జనసైనికులు, NRI జనసైనికులతో చర్చించి సహాయం చేయడానికి ముందుకు వచ్చారు. ఆ వృద్ధురాలితో పాటు ఒక మనువరాలు ఉంది. ఆ అమ్మాయి తల్లిదండ్రులు చిన్నపుడే మరణించారు. నాగాయలంక జనసైనికులు బొడ్డు విజయ్ మిత్రబృందం సహకారంతో ఈ వృద్ధురాలుకు ఇంటి నిర్మాణం కోసం జనసేన పార్టీ తరుపున 21వేల రూపాయలు నగదు సీతమ్మ గారికీ ఇవ్వడం జరిగింది. అదే విధంగా సామాజిక మాధ్యమాల ద్వారా విషయం తెలుసుకోని అమెరికాలో ఉంటున్న NRI సంధ్య గారు వృద్ధురాలు కుటుంబంకు ఆమె వంతుగా 7500 రూపాయలు ఇవ్వటం జరిగింది. దాతలు సహాయం చేసిన డబ్బులుతో మీడియా మిత్రులు శ్రీనుగారు, రవిశంకర్ గారు పాత పూరిపాక తీయించి దాని స్థానంలో నూతనంగా ఇంటి ప్లాన్ వేయించి పాశం సీతమ్మ గారి మనమురాలుతో భూమి పూజ చేపించి ఇంటి నిర్మాణము కోసం శంకుస్థాపన చెయ్యటం జరిగింది. ఈ కార్యక్రమంకు ముఖ్య అతిధిగా కోడూరు సబ్ ఇన్స్పెక్టర్ రమేష్ గారు పాలుగున్నారు. ఈ నిరుపేద వృద్ధురాలు కుటుంబంకు అండగా నిలిచి, సమాజంలో ఇలాంటి మంచి పనికి సహకారం అందించిన దాతలకు ధన్యవాదములు తెలిపారు. 


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com